డ్రగ్స్ కేసు.. పోలీసుల ముందు హాజరైన నవదీప్!

ఈ క్రమంలోనే నవదీప్​ తాజాగా నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ కార్యాలయంలో విచారణకు వచ్చారు.

Update: 2023-09-23 07:43 GMT

టాలీవుడ్​ ప్రముఖ హీరో నవదీప్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరయ్యారు. మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి నేడు(సెప్టెంబర్ 23) విచారణకు హాజరు కావాల్సిందిగా నార్కొటిక్ బ్యూరో అధికారులు రీసెంట్​గా నవదీప్‌‌కు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే నవదీప్​ తాజాగా నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ కార్యాలయంలో విచారణకు వచ్చారు.

డ్రగ్స్​ కేసులో A29గా ఉన్న నవదీప్​ను.. కేసుకు సంబంధించిన పలు అంశాలపై పోలీసులు ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ సప్లయర్ రామచందర్​తో నవదీప్​కు ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవేల నవదీప్​ను డ్రగ్స్‌ వినియోగదారుడిగా పేర్కొన్న పోలీసు అధికారులు.. ఆయన ఎవరెవరి నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నారనే కోణంలో ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, సెప్టెంబరు 14న తెలంగాణకు సంబంధించిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, గుడిమల్కాపూర్ పోలీసు అధికారులతో కలిసి బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్లను సహా పలువురును అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి కొకైన్ సహా పలు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విచారణలోనే.. డ్రగ్స్ వ్యాపారులతో నవదీప్ సంప్రదింపులు జరిపినట్టుగా తమ విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు. అరెస్టైన నిందితుల్లో ఒకరైన రామచందర్​తో నుంచి నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపించిన పోలీసులు.. ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చినట్లు పేర్కొన్నారు.

అయితే నవదీప్ మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నవదీప్ ముందు జాగ్రత్తగా బెయిల్ పిటీషన్ వేయగా హైకోర్టు దాన్ని తిరస్కరించింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టిపారేసింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసులు ఇచ్చి.. విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నవదీప్ కూడా.. పోలీసుల ముందు విచారణకు హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

దీంతో నార్కోటిక్స్ బ్యూరో ఇటీవలే నవదీప్​కు నోటీసులు పంపంగా.. తాజాగా ఆయన వారి ముందు హాజరయ్యారు. మరి అక్కడ విచారణ ఎలా సాగుతుందో మరో కాసేపట్లో తెలియనుంది.

Tags:    

Similar News