కూటమిలో అదే చర్చ.. ఓటు బదిలీ అవుతుందా?
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడు పార్టీలు.. టీడీపీ-బీజేపీ-జనసేనలు కూటమి గా ముందుకు వచ్చాయి.;
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడు పార్టీలు.. టీడీపీ-బీజేపీ-జనసేనలు కూటమి గా ముందుకు వచ్చాయి. వైసీపీ ఓటమి, జగన్‌ను అధికారంలో నుంచి దించేయడమే లక్ష్యంగా ఈ కూట మి మొగ్గ తొడిగింది. సరే... దీనికి సంబంధించి ఎవరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఎవరు ఎన్ని ప్రయ త్నాలు చేశారు..? అనేది పక్కన పెడితే.. మొత్తానికి కూటమి పార్టీలు తాంబూలాలు పుచ్చేసుకుని.. ఎన్నికల తతంగంలోకి అడుగు పెట్టాయి. వీరికి కావాల్సింది.. ఉమ్మడి పోరాటం కన్నా.. ఉమ్మడిగా ఓటు బదిలీ కావడం.
ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పదే పదే చెబుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాం కు చీలకుండా.. చూడడమే ఇప్పుడు ముఖ్యం. ఇదేసమయంలో కూటమి పార్టీల్లో ఓట్లు బదిలీ కూడా కావాలి. ఈ రెండు కీలక అంశాలే.. ఇప్పుడు కూటమికి ప్రధాన పరీక్ష పెడుతున్నాయి. నిజానికి చెప్పాలం టే.. అనుకున్నంత సానుకూలంగా అయితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయం ఆయా పార్టీలకు కూడా తెలుసు. ఇప్పటికీ.. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల కార్యకర్తలు, నాయకులు ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు.
సరే.. మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం కొంత పనిచేస్తున్నా.. అది పూర్తిగా అధినేతల ముందు మాత్రమే కనిపిస్తున్న ఐక్యత. ఇక, ఈ లొసులు అలా ఉంచితే.. కూటమి ఓట్లు బదిలీ అయ్యేలా చంద్రబాబు, పవ న్‌లు అయితే.. అలుపెరుగని కృషి చేశారు. ఒకానొక దశలో జనసేన కార్యకర్తలను, పవన్ అభిమానులను ముగ్ధులను చేసేందుకు నారాలోకేష్ ను సైతం పక్కన పెట్టారు. మేనిఫెస్టో విడుదలలో కానీ.. కూటమి సభల్లో కానీ.. నారా లోకేష్ కనిపించలేదు. దీనికి కారణం.. నెంబర్ 2 స్థానం పవన్‌దేనని ప్రొజెక్టు చేయడమే.
తద్వారా.. జనసేన నుంచి టీడీపీకి ఓట్ల బదలాయింపు చేయాలనేది ప్రధాన లక్ష్యం. ఇక, బీజేపీ నుంచి ఓట్లు బదలాయింపు ఉంటుందా? అంటే.. ఇప్పటి వరకు అలాంటి చర్చలేదు. మరోవైపు.. బదలాయింపు ప్రక్రియ ఎలా ఉన్నా.. మోడీ రాకతో కూటమిలో జోష్ పెరిగిందని పార్టీలు చెబుతున్నాయి. పవన్, చంద్ర బాబు సుడిగాలి పర్యటనలు చేస్తూ.. నాయకులు, కార్యకర్తలు ఎలా ఉన్నా.. తమ పనితాము చేసుకుపోయా రు. తద్వారా.. అయినా.. ఓటు బదిలీ జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు.
కానీ, పరిస్థితి మిశ్రమంగానే ఉంది. సీటు దక్కని వారు ఇంకా అసంతృప్తిలోనే ఉన్నారు. ఉదాహరణకు తిరుపతి, నూజివీడు, పి.గన్నవరం, ఎచ్చర్ల, శ్రీకాకుళం, చీపురుపల్లి వంటి అనేక నియోజకవర్గాల్లో సుమారు 50 వరకు స్థానాల్లో నాయకుల మధ్య కలివిడి కనిపించడం లేదు. ఇది కూటమిలో చర్చకు దారితీస్తోంది. అయితే.. చివరి నిముషంలో అధినేతలు ఇచ్చే పిలుపు. తర్వాత జరిగే సమీకరణలు వంటివి ఏమైనా మార్పు చేసే అవకాశం ఉందని అంచనా వేసుకుంటున్నారు. వాస్తవం అయితే.. ఇదే! దీనికి మించి అంతా బాగుందని అనుకుంటే.. వారికి వారు ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్టే అవుతుంది.