హైదరాబాద్ లో డెకాయ్ ఆపరేషన్... గంజాయి నీతుబాయి అరెస్ట్!

అవును... హైదరాబాద్ లో పోలీసులు చేపట్టిన డెకాయ్ ఆపరేషన్ లో తాజాగా గంజాయి దందా బహిర్గమైంది.

Update: 2024-03-14 07:35 GMT

తెలంగాణలో డ్రగ్స్ వాడకం రోజు రోజుకీ అతిపెద్ద సమస్యగా మారుతుందని అంటున్నారు! ఈ సమయంలో దాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ పోలీస్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాల వ్యవహారంపై సీరియస్ గా స్పందిస్తుందని తెలుస్తుంది. ఈ సమయంలో తాజాగా హైటెక్ సిటీ పరిధిలో గంజాయి గుప్పుమంటోందని.. ఇక్కడ బహిరంగంగానే మత్తుమందు విక్రయాలు జరుగుతున్నాయనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

అవును... హైదరాబాద్ లో పోలీసులు చేపట్టిన డెకాయ్ ఆపరేషన్ లో తాజాగా గంజాయి దందా బహిర్గమైంది. ఈ వ్యవహారం అంతా కొన్ని సంవత్సరాలుగా నీతూబాయి అనే మహిళ సాగిస్తుందని తెలుస్తుంది. గతంలో ఆమెపై పీడీ చట్టం ప్రయోగించి, ఏడాది పాటు జైల్లో ఉంచినా కూడా ఆమె మారలేదని అంటున్నారు. ఇందులో భాగంగా... జైలు నుంచి విడుదలైన తర్వాత తిరిగి గంజాయి దందా కొనసిగిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలుస్తుంది.

ఈ వ్యవహారానికి సంబంధించి సిద్దిపేటలో తీగలాగితే నానక్ రాం గూడ డొంక మొత్తం కదిలిందని తెలుస్తుంది. ఇటీవల సిద్ధిపేట కమిషనరేట్ పోలీసులకు కొంతసమాచారం లభ్యమైంది. ఇందులో భాగంగా... నానక్ రాం గూడలో బహిరంగంగానే గంజాయి విక్రయిస్తున్నారనే విషయంలో ములుగు ప్రాంతంలో చిక్కిన ఇద్దరు గంజాయి విక్రేతలు వెల్లడించారట. దీంతో ఈ విషయంపై సిద్ధిపేట కమిషనర్ అనురాధ కన్ ఫర్మేషన్ కోసం ఒక బృధాన్ని నానక్ రాం గూడకు పంపించగా అక్కడి సన్నివేశం చూసి ఆశ్చర్యపోయారంట!

ఇలా కమిషనర ఆదేశాల మేరకు నానక్ రాం గూడ చేరుకున్న పోలీసులు.. అక్కడ గంజాయి కొనేందుకు సుమారు పదిహేను మంది వరకు క్యూలో నిలబడి ఉండడం కనిపించడంతో వారు కూడా అదే క్యూలో నిలబడి రూ.5వేల విలువైన గంజాయి కావాలని అడిగారట. ఈ సమయంలో నీతూబాయి వారికి సరకు ఇవ్వడంతో తీసుకొని వెనుదిరగడంతో ఆ విషయాన్ని సిద్ధిపేట కమిషనర్‌ అనురాధ.. తెలంగాణ నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య కు చేరవేశారట.

ఇలా పక్కా సమాచారం అందడంతో... సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి సహకారంతో కలిసి బృందాన్ని ఏర్పాటు చేసిన సందీప్ శాండిల్య... ఆ టీం ని నీతూబాయి ఇంటికి పంపారట. ఈ సమయలో ఆమె ఇంటికి వెళ్లడానికి నాలుగు అంచెల్లో గ్రిల్స్ ఉన్నాయని.. ఒక వేళ పోలీసులు ఆ గ్రిల్స్ ని దాటుకుని లోపలికి వెళ్తే.. ఆ గంజాయిని డ్రైనేజ్ లో పాడేసేస్తుందంట నీతూబాయి!

అయితే దానికి తగ్గ కౌటర్ ఏర్పాట్లు చేసుకున్న పోలీసులు లోపలికి వెళ్లగా.. అప్పటికే సుమారు 10మంది గంజాయి కొనుగోలు చేస్తూ కనిపించారంట. దీంతో నీతూబాయి తో సహా ఆ పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు! ఈ సమయంలో ఆమె ఇంట్లో భారీ ఎత్తున గంజాయితో పాటు రూ.16 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఆమెపై మరోసారి పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు హైదరాబాద్‌ పోలీసులు నివేదిక రూపొందించారని సమాచారం!!

Tags:    

Similar News