మానవ మెదడులో ఈ చిప్‌ దొబ్బేయదు!

ఈ నేపథ్యంలో మానవ మెదడు పరిణామ క్రమంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది.

Update: 2024-08-05 13:30 GMT

మానవ మెదడు ఎన్నో అద్భుతాలకు నిలయం. మనుషులకు, జంతువులకు ఉన్న తేడా మెదడే. మానవుల మెదడు ఎంతో విజ్ఞానానికి, ఆవిష్కరణలకు కారణమైంది. ఇంకా మరెన్నో అద్భుతాలు చేయడానికి అది తన సంకేతాలను పంపుతూనే ఉంటుంది.

ఈ నేపథ్యంలో మానవ మెదడు పరిణామ క్రమంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. మానవ మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ నున అమర్చే ప్రయోగాల్లో కీలక పురోగతి సాధ్యమైంది. తాజాగా ఇంకో వ్యక్తికి ఎలక్ట్రానిక్‌ చిప్‌ ను అమర్చారు. ఈ విషయాన్ని న్యూరాలింగ్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు.

ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్‌స్టాల్‌ అయ్యాక .. మెదడు నుంచి విద్యుత్‌ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటి విధులను చిప్‌ నిర్వహ్తింది.. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గారిథమ్‌లుగా మారుస్తుంది.

మానవ మెదడులో తొలి చిప్‌ను విజయవంతంగా అమర్చినట్లు జనవరి చివర్లో న్యూరాలింక్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి మరో ఎనిమిది మందికి మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ ను అమర్చనున్నారు.

కాగా న్యూరాలింక్‌ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఎలక్ట్రానిక్‌ చిప్‌ అమర్చిన రెండో వ్యక్తి పేరును తెలీయనీయడం లేదు. అలాగే అతడికి ఈ చిప్‌ ను ఎక్కడ అమర్చారో కూడా చెప్పకుండా రహస్యంగా ఉంచారు.

వెన్నుపూస, మెదడు సంబంధిత సమస్యలకు మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ అమర్చడం ద్వారా పరిష్కారం చూపవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రెండో వ్యక్తిలో అమర్చిన చిప్‌ లోని 400 ఎలక్టోడ్లు చురుగ్గా పనిచేస్తున్నాయని తేలింది.

తాజాగా ఒక పాడ్‌ కాస్ట్‌ లో న్యూరాలింక్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ఈ చిప్‌ గురించి వివరించారు. మానవ మెదడులో చిప్‌ ను అమర్చే విధానం, రోబోతో చేసే శస్త్ర చికిత్సకు సంబంధించిన విషయాలను ఆయన పంచుకున్నారు. ఇందులో చిప్‌ అమర్చబడిన మొదటి వ్యక్తి అర్బాగ్‌ కూడా పాలుపంచుకున్నాడు.

చిప్‌ అమర్చాక తాను మొదట్లో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని అర్బాగ్‌ తెలిపాడు. అతడికి అమర్చిన చిప్‌ లోని ఎలక్ట్రోడ్లు బయటకు వచ్చేశాయి. దీంతో ఆ సమస్యను న్యూరాలింక్‌ సరిచేసింది. ఇది మినహా ఇతర సమస్యలు ఏమీ ఆర్బాగ్‌ కు ఎదురుకాలేదు.

మానవ మెదడులో ప్రవేశపెడుతున్న ఈ చిప్‌ అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని న్యూరాలింగ్‌ చెబుతోంది. చిప్‌ అమర్చుకున్న రెండో వ్యక్తి అర్బాగ్‌ విజయవంతంగా, చాలా వేగంగా కంప్యూటర్‌ ఆన్‌ చేసినట్టు తెలిపింది. అలాగే చిప్‌ అమర్చబడిన ఒక కోతి వీడియో గేమ్‌ కూడా ఆడిందని వెల్లడించింది.

కాగా మానవ మెదడులో అమర్చిన చిప్‌ 8 మిల్లీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. వెంట్రుకలాంటి సన్నటి ఎలక్ట్రోడ్లు అందులో ఉంటాయి. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి దీన్ని అమరుస్తారు. ఒక చిప్‌ లో 3 వేలకు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఇవి మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌ నకు పంపుతాయి.

Tags:    

Similar News