రైల్వే టికెట్ కోసం కొత్త సదుపాయం.. చదవాల్సిందే

ట్రైన్ లో ప్రయాణం చేయటానికి కాస్త ముందుగా.. ఇంట్లో నుంచి బయలుదేరటానికి ముందే టికెట్ కొనే వెసులుబాటు తాజాగా అందుబాటులోకి వచ్చిందని చెప్పాలి.

Update: 2024-04-26 05:11 GMT

ట్రైన్ జర్నీ చేయని వారు దాదాపుగా ఉండకపోవచ్చు. రిజర్వు టికెట్లను కొనుగోలు చేయటానికి ఆన్ లైన్.. ఆఫ్ లైన్ రెండు వసతులు ఉంటాయి. అదే.. జనరల్ టికెట్లు కొనుగోలు చేయటానికి మాత్రం ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సమయానికి స్టేషన్ కు వెళ్లిన వారికి.. అక్కడున్న టికెట్ కౌంటర్ల బారుల నుంచి టికెట్ తీసుకొని ప్లాట్ ఫాం మీదకు వెళ్లేటప్పటికి రైలు వెళ్లిపోయే సందర్భాలెన్నో.

ఇక.. పండగలు.. పర్వదినాల వేళలో కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి ఉన్న వేళలో ట్రైన్ టికెట్ కొనుగోలు పెద్ద సమస్యగా మారుతుంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం ఆన్ రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ సాయంతో సులువుగా టికెట్ కొనుగోలు చేసే వీలుండేది.

అయితే.. దీంతో ఉన్న ఇబ్బందేమంటే.. రైల్వేస్టేషన్ కు రెండు.. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది.

దీంతో పలు ఇబ్బందుల్ని ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ తాజాగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు వీలుగా కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీంతో స్టేషన్ కు ఎంత దూరంగా ఉన్నా సరే.. టికెట్ కొనుగోలు చేయొచ్చు. ప్లాట్ ఫామ్ టికెట్లను పొందొచ్చు. ఈ సౌకర్యంలో ఇంట్లో ఉండి కూడా టికెట్ ను కొనుగోలు చేసుకునే వెసులుబాటు వస్తుంది.

అయితే.. ఈ మొత్తం ప్రక్రియలో ఒకే ఒక్క పరిమితి ఉంది. అదేమంటే.. రైల్వే స్టేషన్ కు యాభై మీటర్ల లోపు మాత్రం ఈ యాప్ పని చేయదు. ట్రైన్ లో ప్రయాణం చేయటానికి కాస్త ముందుగా.. ఇంట్లో నుంచి బయలుదేరటానికి ముందే టికెట్ కొనే వెసులుబాటు తాజాగా అందుబాటులోకి వచ్చిందని చెప్పాలి.

Tags:    

Similar News