కరోనాను మించిన జపాన్ లోని కొత్త వైరస్.. జస్ట్ 48 గంటల్లో...!
అవును... కరోనా గురించి ఈ ప్రపంచానికి ఏమాత్రం పరిచయం అవసరం లేదనే చెప్పాలి.
ఈ ప్రపంచంలో మనిషి అద్భుతంగా బ్రతుకుతున్నాడన్నది ఎంత నిజమో... అతని చుట్టూ రకరకాల వైరస్ లు బాక్టీరియాలూ తిరుగుతున్నాయని.. అతని జీవితం గాలి బుడగని.. ఈ వైరస్ లు బాక్టీరియాలూ తలచుకుంటే గంటల వ్యవధిలో మనిషి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందనేది అంతే నిజం అనే విషయాన్ని బలపరిచే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈసారి ఈ వ్యవహారం జపాన్ వంతు.
అవును... కరోనా గురించి ఈ ప్రపంచానికి ఏమాత్రం పరిచయం అవసరం లేదనే చెప్పాలి. సుమారు సుమారు మూడు సంవత్సరాల క్రితం, మూడు సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్నీ వణికించి వదిలిన ప్రాణాంతక వైరస్ ఇది. దీనికి జన్మనిచ్చింది చైనా అనేది ప్రపంచానికి తెలిసిన విషయం! ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలి తీసుకున్న వైరస్ ఇది.
కట్ చేస్తే తాజాగా స్ట్రెప్టొకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ ఒకటి తెరపైకి వచ్చింది. ప్రాథమికంగా చెప్పాలంటే... మనిషి కండరాలను కొరికి తినడం దీని ప్రథమిక లక్షణం. ప్రపంచానికి తెలిసిన కరోనా వైరస్ ను మించిన ఈ సరికొత్త బ్యాక్టీరియా జపాన్ లో ఈ మధ్యకాలంలో శరవేగంగా విస్తరిస్తోంది. ఈ బాక్టీరియా సోకితే జస్ట్ 48 గంటల్లో మనిషి మరణిస్తాడు.
అయితే... ఇప్పటికే ఈ బాక్టీరియా చేయాల్సిన పనులన్నీ చేసేస్తున్నప్పటికీ.. దీన్ని నిర్మూలించడానికి ఎటువంటి మందులు లేవు. ప్రస్తుతానికి టెంపరరీ వైద్యమే శరణ్యం. అయితే... ఇప్పటికే జపాన్ దేశంలో సుమారు ఈ బాక్టీరియా పేరుమీద 977 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో... ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 2,500 కు చేరుతుందని జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తెలిపింది. అంటే... ఈ బాక్టీరియా తీవ్రత కొద్దికొద్దిగా ప్రపంచానికి అర్ధమైపోతుంది. పైగా వీటిలో మరణాల రేటు 30 శాతానికి పైగా ఉందని చెబుతున్నారు. 100 మందికి సోకితే 30 మంది మృతిచెందుతారన్నమాట.
అయితే ఈ బ్యాక్టీరియా ప్రభావం చిన్నపిల్లలపై అధికంగా ఉంటుందని అంటున్నారు. ఇందులో ప్రధానంగా... గొంతు వాపు, శ్వాస సంబంధిత ఇబ్బందులను కలిగిస్తుందని చెబుతున్నారు. ఇదే క్రమంలో... ఇదే గ్రూపుకు చెందిన బాక్టీరియా శరీర అవయువాల పనితీరును ధ్వంసం చేస్తుందని.. ఇందులో భాగంగా... శరీర అవయువాల పనితీరును ఇది ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.
ఇందులో భాగంగా.. కండరాల వాపుతో పాటు స్కిన్ ఇంఫెక్షన్లు, బ్లడ్ ప్రెజర్, గుండె పనీతిరు, శ్వాసతీసుకోవడం వంటి విషయాల్లో ఇబ్బందులు కలగజేస్తుందని.. ఇదే క్రమంలో కాలేయ ఇబ్బందులు వంటిని తలెత్తుతాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ బాక్టీరియా సోకిన వ్యక్తి సుమారు 48 గంటల్లో మరణించే ప్రమాదం ఉందని అంటున్నారిఉ టోక్యో మహిళా యూనివరిశిటికి చెందిన ప్రొఫెసర్ కెన్ కుకుచి.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఇందులో భాగంగా... ఈ బ్యాక్టీరియాను కట్టడి చేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలంటూ జపాన్ ను కోరింది. మరి ఇది ఇక్కడితో ఆగిపోతుందా.. కరోనాలా కోరలు చాచుతుందా అనేది వేచి చూడాలి.