తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది.. నిర్మలమ్మ సంచలనం
బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేస్తున్నామన్న ఆరోపణల్లో నిజం లేదన్న నిర్మలమ్మ.. కేంద్రానికి ఏ రాష్ట్రం పట్ల వివక్ష లేదని స్పష్టం చేశారు.
కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో మొంవిడిచేయి చూపారని.. వివక్ష పాటించారని.. బీజేపీ రాష్ట్రాలకు పెద్ద పీట వేశారంటూ కాంగ్రెస్ ఎంపీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వేళలో.. నిర్మలమ్మ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ కేటాయింపులపై విమర్శలకు సమాధానమిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళలో మిగులు బడ్జెట్ అని.. విభజన తర్వాత అప్పుల్లో కూరుకుపోయినట్లుగా పేర్కొన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేస్తున్నామన్న ఆరోపణల్లో నిజం లేదన్న నిర్మలమ్మ.. కేంద్రానికి ఏ రాష్ట్రం పట్ల వివక్ష లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు తాము చేసిన కేటాయింపులపై వివరణ ఇచ్చారు. తెలంగాణకు రెండు భారీ ప్రాజెక్టులు మంజూరు చేశామని చెప్పిన నిర్మలమ్మ.. ‘కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, మెదక్ జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ నోట్ మంజూరు చేశాం. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన విషయం వాస్తవం. కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది. తెలంగాణ అప్పులపై మేం ఏ రాజకీయ పార్టీని నిందించటం లేదు. బడ్జెట్ లో ఏ ఒక్క రాష్ట్రానికి పెద్దపీట వేయలేదు’’ అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. అన్ని రాష్ట్రాల్ని సమానంగా చూశామా? అన్న ప్రశ్న
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఈ ఏడాది ఎన్నికలు జరిగే బిహార్ కు నిధుల కేటాయింపు.. ప్రాజెక్టుల విషయంలో పెద్దపీట వేసిన విషయాన్ని నిర్మలమ్మ మర్చిపోయినట్లున్నారు. తమకు అనుకూలంగా మాట్లాడటమే తప్పించి.. విపక్షాలు అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేకపోతున్న విషయం నిర్మలమ్మ మాటలకు చేతలకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా కనిపించక మానదు.
తెలంగాణకు తమ ప్రభుత్వం చాలానే చేసిందన్న విషయాన్ని చెప్పేందుకు ఆమె పలు అంశాల్ని పరిగణలోకి తీసుకున్నారు. 2014 నుంచి తెలంగాణలో 2605 కి.మీ. మేర హైవేల నిర్మాణం చేపట్టామని.. భారత్ మాల కింద 4 గ్రీన్ ఫీల్డ్ కారిడార్లు నిర్మించిన విషయాన్ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బీబీనగరర్ ఎయిమ్స్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని.. తెలంగాణకు ఐదు వందే భారత్ రైళ్లు కేటాయించిన వైనాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది తెలంగాణలో రైల్వేలకు రూ.5337 కోట్లు కేటాయించినట్లు చెప్పటం ద్వారా తెలంగాణ విషయంలో తాము ఎలాంటి వివక్ష పాటించట్లేదన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారని చెప్పాలి.