కాశీ ట్రిప్ తో నీతూ అంబానీ ఫేవరేట్ బయటకొచ్చింది
తన చిన్న కుమారుడు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న అంబానీ దంపతులు బుధవారం ఒకే రోజున ఈ ఇద్దరు వేర్వేరు చోట్ల ఉన్నారు.
ప్రపంచంలో టాప్ పది సంపన్నుల్లో ఒకరిగా.. ఆసియాలో అపర కుబేరుడిగా పేరున్న అంబానీల జీవనశైలి ఒక్కోసారి ఎంత సాదాసీదాగా ఉంటుందో చూస్తునే ఉంటాం. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికి సింఫుల్ గా ఉండటం.. సాదాసీదా ఇష్టాలను మొహమాటం లేకుండా ప్రదర్శించే వారి ధోరణి పలుమార్లు కట్టి పారేయటమే కాదు.. వారి తీరు ప్రజల మనసుల్ని దోచుకునేలా చేస్తుంది. తాజాగా అలాంటి తీరును మరోసారి ప్రదర్శించారు నీతూ అంబానీ.
తన చిన్న కుమారుడు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న అంబానీ దంపతులు బుధవారం ఒకే రోజున ఈ ఇద్దరు వేర్వేరు చోట్ల ఉన్నారు. అనంత్ -రాధిక పెళ్లి బాజాలు జులై 12న బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ సెంటర్ లో మూడు రోజుల పాటు జరగనున్న సంగతి తెలిసిందే. తమ ఇంట్లో జరుగుతున్న పెళ్లికి సంబంధించిన మొదటి శుభలేఖను కాశీ విశ్వేశురుడికి ఇచ్చేందుకు ఆమె బనారస్ (అదేనండి కాశీ)కు వచ్చారు. అదే సమయంలో నీతూ అంబానీ భర్త ముకేశ్ అంబానీ తన కొడుకు.. కాబోయే కోడల్ని తీసుకొని మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు ఇళ్లకు వెళ్లి వెడ్డింగ్ కార్డులు ఇచ్చి వచ్చారు.
పదేళ్ల తర్వాత తాను కాశీకి మళ్లీ వచ్చానంటూ తీవ్రమైన భావోద్వేగానికి గురైన ఆమె.. కాశీకి మళ్లీ రావటం తన అద్రష్టంగా పేర్కొన్నారు. ఇక్కడ చాలా బాగుంటుందని.. ఇక్కడ గొప్ప శక్తి ఉంటుందని పేర్కొన్నారు. కాశీకి వెళ్లిన నీతూ అంబానీ తమ ఇంట జరిగే పెళ్లి శుభలేఖను కాశీ విశ్వనాధునికి సమర్పించిన అనంతరం ఆమె.. ఆ పట్టణంలోని ఫేమస్ చాట్ భండార్ అయిన కాశీ చాట్ భండార్ కు వెళ్లారు.
అక్కడ ఆమె టమాటా చాట్ ను తిన్నారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది నుంచి చాట్ రెసిపీని అడిగి తెలుసుకున్నారు. బనారస్ లో పాపులర్ అయిన ఈ చాట్ బండార్ కు విదేశీయులు కూడా విజిట్ చేసి టేస్ట్ చేస్తారని చెబుతారు. చాట్ బండార్ కు వెళ్లి అక్కడి ఫుడ్ ను టేస్ట్ చేసిన ఆమె.. అక్కడి కల్చర్ గురించి అడిగి తెలుసుకున్నారు. అంబానీ ఫ్యామిలీ అడుగు పెట్టని బిజినెస్ అన్నదే లేదు. అలాంటి రిలయన్స్ అధినేత సతీమణి ఒక చాట్ షాప్ కు వెళ్లి.. తనకు నచ్చిన కొన్ని ఫుడ్ లను ఆర్డర్ ఇచ్చి.. రుచి చూసిన వైనం అక్కడి వారిని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇలాంటి సాదాసీదా అభిరుచులున్న అపర కుబేరుల ఫ్యామిలీని మరెక్కడైనా చూశారా?