2025 కోసం వైరల్ గా నోస్ట్రాడమస్ సంచలన అంచనాలు!
ఈ క్రమంలో ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త, జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ విశ్లేషించిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది లోకి అడుగుపెట్టబోతుంది ప్రపంచం. ఈ ఏడాది ఎదురైన చేదు జ్ఞాపకాలను అదిగమించి.. కోటి కొంగొత్త ఆశలతో మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోతోంది. ఈ సమయంలో.. ఈ ప్రపంచం కొత్త ఏడాది (2025)లో ఎలా ఉండబోతుంది.. ఎలాంటి మంచిని చూడబోతోంది.. ఇంకెలాంటి చెడును భరించబోతోందనేది ఆసక్తిగా మారింది.
ఈ తరహా ఉత్సుకత వ్యక్తులకు మాత్రమే కాదు.. ప్రపంచ భవిష్యత్తుపైనా నెలకొంటుంటుంది. దీంతో సుమారు వందల ఏళ్ల క్రితం అధ్యాత్మిక వేత్తలు, తత్వవేత్తలు, జోతిష్యులు చెప్పిన విషయాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త, జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ విశ్లేషించిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
అవును... నోస్ట్రాడమస్ జోస్యం పై చాలా మందికి నమ్మకం ఉంటుందని చెబుతుంటారు. ఆయన చెప్పినవి కచ్చితంగా జరుగుతాయని నమ్ముతుంటారు. సుమారు 942 సంపుటిలతో కూడిన ఈ విశ్లేషణలను 1555లో విడుదల చేయగా.. ఆయన చెప్పినట్లుగానే హిట్లర్ ఆధిపత్యం, ప్రపంచ యుద్ధం, 9/11 ఉగ్రదాడులు, కరోనా వైరస్ వంటి అంచనాలు నిజమయ్యాయని చెబుతారు.
ఈ నేపథ్యంలోనే రాబోయే నూతన సంవత్సరం 2025 గురించిన జోస్యం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో భాగంగా.. 2025లో భూమిని పెద్ద గ్రహశకలం ఢీకొట్టవచ్చని.. లేదా, అత్యంత ప్రమాదకరంగా సమీపంగా రావ్వచ్చని.. ప్రకృతి వైపరిత్యాలు.. రాజకీయ హత్యలు జరిగే అవకాశం ఉందని నాస్ట్రాడమస్ అంచనా వేశారు.
ఇదే సమయంలో సుదీర్ఘంగా సాగుతోన్న యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. దీంతో... రష్యా-ఉక్రెయిన్ వార్ ని తలచుకుంటున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో.. బ్రెజిల్ లో వరదలు, యూకేలో ప్లేగు వ్యాది వ్యాప్తి, అగ్ని పర్వతం బద్దలవ్వడం మొదలైన ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తాయని ఫ్రెంచ్ జోతిష్యుడు అంచనా వేశారు.