ప్రభుత్వ నిధులతోనే ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులు, స్పందించిన HMDA కమిషనర్

దీనిపై స్పందించిన HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రభుత్వ నిధులతోనే మరమ్మతులు చేస్తామని ప్రకటించారు.

Update: 2025-01-21 06:55 GMT

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులు చేసేందుకు HMDA ముందుకొచ్చింది. ఈ నెల 19న ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఘాట్ నిర్వహణ సరిగా లేదని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన సొంత డబ్బుతో ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులు చేయాలని, అవసరమైన అనుమతులు తీసుకోవాలని మంత్రి తన సిబ్బందిని ఆదేశించారు. దీనిపై స్పందించిన HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రభుత్వ నిధులతోనే మరమ్మతులు చేస్తామని ప్రకటించారు.

ఈ నెల 19న ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు మంత్రి లోకేశ్ వెళ్లారు. ఎన్టీఆర్ కు నివాళులర్పించిన అనంతరం ఘాట్ పరిసరాలను పరిశీలించిన మంత్రి లోకేశ్ ఘాట్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘాట్ గోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపోవడం, గార్డెన్ లో ఏర్పాటు చేసిన లైట్లు విరిగిపడి ఉండటాన్ని మంత్రి గమనించి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఘాట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న హెచ్ఎండీఏపై అసహనం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ బాధ్యతలు తమకు అప్పగించాలని ఎన్టీఆర్ ట్రస్టు ఎన్నిసార్లు అడుగుతున్నా, హెచ్ఎండీఏ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులు సొంతంగా చేయాలని లోకేశ్ నిర్ణయించడంతో అవసరమైన అనుమతుల కోసం ఎన్టీఆర్ ట్రస్టు దరఖాస్తు చేసింది. అయితే ఘాట్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే చూస్తుందని చెప్పిన హెచ్ఎండీఏ కమిషనర్ వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

Tags:    

Similar News