మిస్ టీన్ యూనివర్స్ 2024 గా ఎన్నికైన భారతీయ అందం..
అందాల పోటీ ఏదైనా కానీ అందులో మన భారతదేశానికి చెందిన అమ్మాయిలు లేకుండా ఉండరు.
అందాల పోటీ ఏదైనా కానీ అందులో మన భారతదేశానికి చెందిన అమ్మాయిలు లేకుండా ఉండరు. ఈ విషయాన్ని తిరిగి మరొకసారి ప్రూవ్ చేస్తే అంతర్జాతీయ అందాల పోటీలు మరొకసారి మన భారతీయ అందం మెరిసింది.
దక్షిణాఫ్రికాలోని కింబర్లీలో నిర్వహించిన మిస్ టీన్ యూనివర్స్ 2024 పోటీల్లో మన ఇండియాకు చెందిన విద్యార్థి పార్టిసిపేట్ చేయడమే కాకుండా కిరీటాన్ని తన సొంతం చేసుకుంది.మిస్ టీన్ యూనివర్స్ పోటీలలో మన దేశానికి చెందిన అమ్మాయి కిరీటం గెలవడం ఇది తొలిసారి కావడం విశేషం.
ఈ అందాల పోటీలు నవంబర్ 1వ తారీకు నుంచి 9 వరకు జరిగాయి. ఈ పోటీలలో ఒడిస్సా కు చెందిన తృష్ణ రే అని అమ్మాయి విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని కోటి నిర్వాహకులు అధికారికంగా తమ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.తృష్ణ ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్‌లోని
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూనివర్సిటీ లో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతోంది.
కింబర్లీలో నిర్వహించిన ఈ పోటీలలో త్రిష రే తో సహా , నమీబియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్, నెదర్లాండ్స్ సహా పది దేశాల యువతులు ఫైనల్స్ కు అర్హత సాధించారు. మీరందరినీ ఓడించి.. తృష్ణ రే ఈ పోటీలలో విజేతగా నిలిచి మిస్ టీన్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇక పోటీ ప్రారంభం నుంచి
తృష్ణ కు గట్టి పోటీ ఇచ్చిన నమీబియాకు చెందిన ప్రీసియస్ ఆండ్రేల రెండో రన్నరప్ గా నిలిచింది.
తృష్ణ గత ఏడాది ఏప్రిల్ 13న జరిగిన మిస్ టీన్ యూనివర్సిటీ ఇండియా పోటీల్లో కూడా విజేతగా నిలిచింది.తృష్ణ రే తండ్రి కల్నల్ దిలీప్ కుమార్ రే ఇండియన్ ఆర్మీ అధికారి. తృష్ణ రే ఈ పోటీలలో గెలిచింది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తో నెటిజన్స్ ఆమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా లో ఆమె ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నయి. ఆమె విజయం అటు ఒడిస్సా కి ఇటు భారత్ కు ఎంతో గర్వకారణం అని పొగుడుతున్నారు.