జమ్మూకశ్మీర్ కాబోయే సీఎం మూఢనమ్మకం తెలుసా?... ఇకపై లేదంట!
ఈ సమయలో జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ తనకున్న మూఢనమ్మకంపై ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ గెలుపు అనంతరం సీఎంగా ఒమర్ అబ్ధుల్లా బాధ్యతలు చేపడతారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్పందించిన ఒమర్ అబ్దుల్లా... తనకు ఉన్న మూఢనమ్మకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ గెలుపు అనంతరం సీఎంగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టబోతున్నారని అంటున్నారు. ఈ సమయలో జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ తనకున్న మూఢనమ్మకంపై ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా కౌంటింగ్ రోజు మార్నింగ్ రన్ పై స్పందించారు.
ఇందులో భాగంగా.. క్రితంసారి కౌంటింగ్ రోజున మార్నింగ్ రన్ కు వెళ్లి ఓటమి చవిచూశానని చెప్పిన ఒమర్ అబ్దుల్లా.. ఆ సెంటిమెంట్ తో ఈసారి కౌంటింగ్ రోజు మార్నింగ్ వాకింగ్ కి వెళ్లాలా.. వద్దా..? అనే గందరగోళంలో పడిపోయినట్లు చెప్పారు. ఇప్పుడు పరుగెత్తడానికి వెళ్లి ఓడిపోతే.. ఇకపై మళ్లీ పరిగెత్తను అని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
కానీ... తనకు కలిగిన ఈ మూఢనమ్మకనాన్ని దూరం చేసుకొవాలి అని తనలో తాను ఆలోచించుకొని.. చివరకు పరుగెత్తడానికే నిర్ణయించుకున్నట్లు ఒమర్ తెలిపారు. ఇప్పుడు తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు పరుగెత్తుతానని సరదాగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కి 42 సీట్లు రావడంపై ఒమర్ ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
సుమారు పదేళ్ల తర్వాత జరిగిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు రాబోవంటూ సర్వే సంస్థలు అంచనాలు వేసిన నేపథ్యంలో.. ఆ అంచనాలను తారుమారు చేస్తూ జమ్మూకశ్మీర్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీనిపైనా స్పందించిన ఒమర్.. ఇన్ని సీట్లు వస్తాయని తాను ఊహించలేదని.. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి చేయాల్సింది ఎంతో ఉందని గుర్తుచేస్తూ ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని అన్నారు.