దాయాది పాక్ మొండితనం ... కాశ్మీర్ విషయంలో అలవి కాని తీర్మానం!
పాకిస్తాన్ కి భారత్ అంటే ఎపుడూ ద్వేషమే అన్నది పదే పదే రుజువు అవుతూనే ఉంది. పాకిస్తాన్ తన దేశాన్ని తాను చక్కదిద్దుకోలేని స్థితిలో ఉందని జాతీయ వాదులు అందుకే పరిహస్తూంటారు.
పాకిస్తాన్ కి భారత్ అంటే ఎపుడూ ద్వేషమే అన్నది పదే పదే రుజువు అవుతూనే ఉంది. పాకిస్తాన్ తన దేశాన్ని తాను చక్కదిద్దుకోలేని స్థితిలో ఉందని జాతీయ వాదులు అందుకే పరిహస్తూంటారు. ఇక తనకు వల్ల కానిది తన పరిధిలో లేనిది అలవి కాని డిమాండ్లు చేయడం పాక్ కి అలవాటే అని అంటున్నారు.
ఇపుడు కూడా పాకిస్తాన్ అలాంటి తీర్మానం ఒకటి చేసింది. కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని పాకిస్థాన్ పార్లమెంట్ లో ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను భారత్ అమలు చేయాలని కూడా కోరింది. కాశ్మీర్ ప్రజలు తమ ప్రజాస్వామిక హక్కులను ఉపయోగించుకునేలా భారత్ చేయాలని సూచిస్తోంది.
నిజానికి చూస్తే ప్రజాస్వామ్యం అంటూ పాకిస్థాన్ భారత్ కి చెప్పడమే వింత అని అంటున్నారు పాకిస్థాన్ లో ఏ రకమైన పాలన సాగుతోంది అన్నది తెలిసిందే అంటున్నారు. ఇక తనకు సంబంధం లేని తన పరిధిలో లేని అంశాల మీద తీర్మానాలు చేసి అభాసుపాలు కావడం పాక్ కి ఇదే మొదటిసారి కాదని అంటున్నారు. గతంలో అనేక సార్లు పాక్ ఇలాగే చేసింది అని గుర్తు చేసుకుంటున్నారు.
కాశ్మీర్ విషయంలో తాజాగా పార్లమెంట్ లో తీర్మానం పెట్టి పాక్ ఏకగ్రీవంగా ఆమోదం పొందేలా చేయడంలో ఉద్దేశ్యం ఏమిటో అర్థం కావడం లేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ తీర్మానాన్ని కాశ్మీర్ వ్యవహారాల ఇంజనీర్ అమీర్ ముకం పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన కాశ్మీర్ గురించి చాలా మాటలే చెప్పారు. కాశ్మీరీల హక్కుల కోసం పాకిస్థాన్ నైతికంగా రాజకీయంగా దౌత్య పరంగా మద్దతు ఇస్తుందని చెబుతున్నారు.
కాశ్మీరు లో మానవ హక్కుల పరిస్థితులను మెరుగుపరచాలని అలాగే అక్కడ నిర్బంధించిన నేతలను విడుదల చేయడంతో పాటు అణచివేత ధోరణులను విడనాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా రూపొందించిన తీర్మానాన్ని పాక్ పార్లమెంట్ లో ఆమోదించారు.
విషయానికి వస్తే భారత్ లో కాశ్మీర్ అంతర్భాగం అని భారత్ పదే పదే చెబుతూ వస్తోంది. పైగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక హోదా అన్నది ఇక లేదు. అదే విధంగా చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా రూపొందించబడ్డాయి. ఇక చాలా ఏళ్ళుగా భారత్ పాక్ ల మధ్య సంబంధాలు క్షీణ దశకు చేరుకున్నాయి.
ఉవన్నీ పక్కన పెడితే కాశ్మీర్ అన్నది భారత్ లో ఎప్పటికీ భాగమే అని భారత్ చాలా గట్టిగా అనేక అంతర్జాతీయ వేదికల మీద చెబుతూనే ఉంది. ఈ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న మొండి వాదనను కూడా తిప్పికొడుతోంది.
కానీ దాయాది పాక్ మాత్రం కాశ్మీర్ జపం వీడడం లేదు.
నిజానికి పాక్ లో ప్రజల హక్కులు ఎక్కడ అన్న ప్రశ్న ఆ దేశం వేసుకోవాలని అంటున్నారు. అంతే కాదు ఆకలి, నిరుద్యోగం అశాంతితో పాక్ అల్లల్లాడిపోతోంది ముందు తన దేశం మీద పాక్ దృష్టి పెట్టి చక్కదిద్దుకుంటే బాగుంటుందని జాతీయ వాదులు దాయాదికి సూచిస్తున్నారు. ఈ తీర్మానాన్ని భారత్ ఏ మాత్రం సీరియస్ గా తీసుకునే అవకాశాలు లేవని అంటున్నారు. పాక్ తన దేశంలో సమస్యలను పక్క దోవ పట్టించడానికే అన్న చర్చను కూడా తెస్తున్నారు.