కాకులు దూరని కారడవి.. పావురాలు ఎగరని పాక్ నగరాలు.. ఎందుకో?

కాకులు దూరడని కారడవి.. చీమలు పట్టని చిట్టడవి.. అని మనం పుస్తకాల్లో చదివి ఉన్నాం.. అంటే.. దట్టమైన అడవులను ఇలా పోల్చారన్నమాట

Update: 2024-10-11 23:30 GMT

కాకులు దూరడని కారడవి.. చీమలు పట్టని చిట్టడవి.. అని మనం పుస్తకాల్లో చదివి ఉన్నాం.. అంటే.. దట్టమైన అడవులను ఇలా పోల్చారన్నమాట. మనుషులు వెళ్లలేని అడవులను మన పెద్దలు ఇలా వర్ణించారన్నమాట. కానీ, పావురాలు ఎగరని నగరాల గురించి విన్నారా? అదేంటి.? అదెలా సాధ్యం అంటారా? అసలు ఇలాంటి నగరాలు ఉన్నాయా? ఉంటే ఎక్కడ ఉన్నాయి.?

పాక్ పాపాలు వాటికే శాపాలు

పాకిస్థాన్ అంటే ఎలాంటి దేశమో మనందరికీ తెలిసిందే. ఉగ్రవాదాన్ని ఎగదోసి భారత్ లో అశాంతి రేపాలని ప్రయత్నించిన ఆ దేశం ఇప్పుడు అదే ఉగ్రవాదానికి బలై పోతోంది. పాక్ లో కొన్నేళ్ల నుంచి వరుస బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. పైగా బలూచిస్థాన్ ఉద్యమం ఒకటి. రాజకీయ అస్థిరత, సైన్య పెత్తనం పాకిస్థాన్ కు పెట్టని ఆభరణాలు. అలాంటి దేశంలో కొన్నేళ్ల కిందట కనీసం క్రికెట్ మ్యాచ్ లు కూడా జరగలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే వివిధ దేశాల జట్లు పాక్ లో పర్యటిస్తున్నాయి.

ఆ రెండు నగరాలు 5 రోజులు షట్ డౌన్

షాంఘై కో ఆపరేషన్ కార్పొరేషన్ (ఎస్ సీవో) సదస్సు రెండు రోజుల పాటు పాకిస్థాన్ లో జరగనుంది. శనివారం నుంచి ఐదు రోజుల పాటు ఈ సదస్సు పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్, రావల్పిండిలో జరగనుంది. దీనికి భద్రత కల్పించడం పాక్ కు తలకు మించిన భారంగా మారింది. దీంతో ఇస్లామాబాద్, రావల్పిండి నగరాలను షట్ డౌన్ చేయాలని నిర్ణయించింది. పావురాలు ఎగరకూడదని ఆంక్షలు విధించింది. గాలిపటాలను కూడా బ్యాన్ చేసింది. దీనికోసం పావురాల గూళ్లను తొలగించేశారట. ఇక షట్ డౌన్ లో భాగంగా రెస్టారెంట్లు, వెడ్డింగ్ హాళ్లు, కేఫ్ లు, స్నూకర్ క్లబ్ లు, మార్ట్ లు సహా అన్నిటినీ మూసివేస్తున్నారు. భవనాలపై కమాండోలను, స్నైపర్ షూటర్లను మోహరిస్తున్నారు.

Tags:    

Similar News