స్టార్ ఫ్యామిలీ... కుటుంబం మొత్తం కలిసి 630 లీటర్ల రక్తదానం!

ప్రతీ ఆరు నెలలకూ రక్తదానం చేయడం మంచి ఆలొచన అని చెబుతుంటారు.

Update: 2024-09-30 23:30 GMT

రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి అనేది చాలా మందికి తెలిసిన విషయమే. అయినప్పటికీ చాలా మందిలో రక్తదానంపై ఉన్న అవగాహన అంతంతమాత్రమె కాగా.. మరికొంతమందికి ఇప్పటికీ రక్తదానం చేస్తే తమకేదో నష్టం జరుగుతుందనే అపోహ కూడా ఉంది! ఈ సమయంలో ఓ కుటుంబం మాత్రం ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

అవును... రక్తదానం అంటే ప్రాణదానం అని అంటారు. ప్రతీ ఆరు నెలలకూ రక్తదానం చేయడం మంచి ఆలొచన అని చెబుతుంటారు. చాలా మంది దీన్ని ఆచరిస్తుంటారు!.. మరికొంతమంది మాత్రం ఇప్పటికీ అపోహల మాటున కాలం వెళ్లదీస్తుంటారు. ఈ సమయంలో గుజరాత్ కు చెందిన ఓ కుటుంబం మాత్రం పదుల సంఖ్యలో రక్తదానాలు చేస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్ లోని మణేక్ బాగ్ ప్రాంతానికి చెందిన ఓ పటేల్ కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో 27 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 16 మంది ఇప్పటివరకూ 50 సార్లకు పైనే రక్తదానం చేశారు. ఇక 100 ఏళ్లకు దగ్గరగా ఉన్న నలుగురైతే ఇప్పటివరకూ 100 సార్లకు పైనే రక్తం ఇచ్చారు.

ఇలా ఆ కుటుంబం మొత్తంగా 1,400 యూనిట్ల రక్తం దానమిచ్చింది. అంటే... వీరంతా కలిసి ఇప్పటివరకూ 630 లీటర్ల వరకూ రక్తం దానం చేశారన్నమాట! ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు ఈ విషయాలు వెల్లడించాయి. ఇదే సమయంలో... ఇదే ప్రాంతానికి చెందిన మలవాంకర్ ఫ్యామిలీ 356 లీటర్ల రక్తదానం చేసినట్లు చెబుతున్నారు.

నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని అహ్మదాబాద్ లో రక్తదాతలను అభినందిస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇలాంటి రక్తదాతలను అభినందించారు. వీరంతా ఇప్పటివరకూ ఎన్నో ప్రాణాలు కాపాడారని తెలిపారు.

Tags:    

Similar News