మంత్రి వస్తున్నారు.. అరటిపండ్లు అన్నీ తీసేయండి!

అయితే... ఓ మహిళా మంత్రికి మాత్రం అరటిపండు అంటే విపరీతమైన భయమూ కమ్ అయిష్టత అంట.

Update: 2024-11-15 05:06 GMT

సాధారణంగా అరటిపండు అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది. ప్రతీ రోజూ ఒక అరటిపండు అయినా తినేలా ప్లాన్ చేసుకుంటారు.. మరికొంతమంది పెరుగు అన్నంలో అరటిపండును కలుపుకుని తిని మురిసిపోతుంటారు. అయితే... ఓ మహిళా మంత్రికి మాత్రం అరటిపండు అంటే విపరీతమైన భయమూ కమ్ అయిష్టత అంట.

అవును... స్వీడన్ కు చెందిన మంత్రి ఫౌలీనా బ్రాండ్ బర్గ్.. అసాధారణ ఫోబియా ఉందంట. దీని ప్రకారం అరటిపండు పేరు చెబితే ఆమె భయపడిపోతారంట. దీంతో.. ఆమె అధికారిక పర్యటనలకు వస్తే ఆ చుట్టుపక్కల ఎక్కడా ఈ పండ్లు కనిపించకుండా జాగ్రత్త పడతారంట అధికారులు. ఇలా ఈ మహిళా మంత్రికి 'బననా ఫోబియా' ఉందనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆమె అధికారిక పర్యటనల సందర్భంగా సదరు మంత్రిత్వ శాఖ తాజాగా పంపిన ఈ-మెయిల్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. ఈ ఈ-మెయిల్ లో "ఆమె పర్యటించే చోట ఎక్కడా అరటిపండు కనిపించకూడదు.. ఆమె బసకు ఏర్పాటు చేసే గదుల్లో కానీ, ఆమె పాల్గొనే సభల్లోని వేదికలపై కానీ అవి కనిపించకూడదు" అంటూ పేర్కొన్నారంట.

అయితే... స్వీడన్ పార్లమెంట్ లో ఇలాంటి సమస్య ఫౌలీన బ్రాండ్ బర్గ్ కు మాత్రమే పరిమితం కాలేదని.. ఈమెతో పాటు మరో మహిళా ఎంపీ థెరీసా కర్వాళో కూడా ఇదే విధమైన సమస్యతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన థెరీసా... "పని పరిస్థితులపై మనం ఎన్నో కఠినమైన డిబేట్లలో పాల్గొంటాం కానీ.. ఈ విషయంలో మాత్రం మనం ఐకమత్యంగా ఉందాం" అని సూచిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.

ప్రస్తుతం ఈ వ్యవహారంపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన నిపుణులు.. ఈ సమస్యను "బనానా ఫోబియా" అంటారని.. ఇది అత్యంత అరుదైన సమస్య అని.. ఇలాంటి వారికి అరటిపండ్లు కనిపించినా, వాటి వాసన పీల్చినా తీవ్ర ఆందోళనకు గురవుతారని.. ఇది చిన్నతనంలోనే వస్తుందని అంటున్నారు. వాస్తవానికి తనకు ఈ ఫోబియా ఉన్నట్లు ఫౌలీనా గతంలోనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Tags:    

Similar News