పెళ్లి కాలేదు.. 100 మంది పిల్లలు.. తెరపైకి వింతైనా ఆఫర్!

తనకు పెళ్లి కాలేదు కానీ 100 మంది పిల్లలు అంటూ గతంలో ఓ సంచలన ప్రకటన చేసిన పావెల్ దురోవ్ తాజాగా వింతైన ఆఫర్ తెరపైకి తెచ్చారు.

Update: 2024-11-13 03:50 GMT

తనకు ఇంకా పెళ్లి కాలేదని.. కానీ, 100 మంది పిల్లలు అంటూ టెలీగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ గతంలో సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని ఇష్టపడుతున్న ఓ వ్యక్తికి ఇదేలా సాధ్యమైందని అనుకుంటున్నారా? అంటూ ఓ పెద్ద ప్రశ్నే వేశారు. ఈ సమయంలో మరో వింతైన ఆఫర్ ను తెరపైకి తెచ్చారు.

అవును... తనకు పెళ్లి కాలేదు కానీ 100 మంది పిల్లలు అంటూ గతంలో ఓ సంచలన ప్రకటన చేసిన పావెల్ దురోవ్ తాజాగా వింతైన ఆఫర్ తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా... సంతానం కోసం తన్న వీర్యకణాలు ఉపయోగించుకోవాలనుకునే మహిళలకు ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స అందిస్తానని హామీ ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

ఈ సందర్భంగా... తమ ఆల్ట్రవిటా ఫెర్టిలిటీ క్లీనిక్ లో పావెల్ దురోవ్ వీర్యకణాలు ఉపయోగించుకొని ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స పొందొచ్చని ఆల్ట్రావిట్ తన వెబ్ సైట్ లో పేర్కొంది. ఇదే సమయంలో... అతడిని అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తగా పేర్కొంటూ.. ఈ ప్రక్రియలో మెరుగైన ఫలితాలు పొందేందుకు అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నట్లు తెలిపింది.

కాగా.. సుమారు 15 ఏళ్ల కిందట తన స్నేహితుడొకరు తనను కలిసి వింత సాయం కోరాడని.. తన మిత్రుడికి, అతడి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సంతానం కోసం తనను వీర్యదానం చేయమని అడిగారని.. అది విని తనకు నవ్వొచ్చినా.. ఆ తర్వాత ఈ సమస్య ఎంత తీవ్రమైందో అర్ధమైందని వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే ఈ సమస్య తీవ్రత అర్ధమై స్పెర్మ్ డొనేషన్ లో రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపారు. అలా ఇప్పటివరకూ 12 దేశాల్లో వందమందికి పైగా జంటలకు సంతానాన్ని అందించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉందని.. అలాంటి వారికి పిల్లలను ఇచ్చి ఆ జంటల ఇంట సంతోషం తెచ్చేందుకు తాను గర్వపడుతున్నట్లు చెప్పుకొచ్చారు పావెల్.

ఈ నేపథ్యంలోనే రష్యా రాజధాని మాస్కోలో ఆల్ట్రావిటా క్లీనిక్ ఉందని.. ఆ క్లీనిక్ లో పావెల్ దురోవ్ వీర్యకణాలు ఉపయోగించుకొని ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స పొందొచ్చని ఆల్ట్రావిటా తన వెబ్ సైట్ లో పేర్కొంది.

Tags:    

Similar News