టీవీకే పార్టీ అధినేత విజయ్ కు జనసేన పార్టీ అధినేత విషెస్ ఇవే!

దీంతో... సుమారు 10 నుంచి 20 కిలోమీటర్ల మేర వాహనాల బారులు కనిపించిన పరిస్థితి.

Update: 2024-10-28 10:22 GMT

తమిళ స్టార్ హీరో, దళపతి జోసెఫ్ విజయ్ "తమిళగ వెట్రి కళగం" (టీవీకే) తొలి రాష్ట్రస్థాయి మహానాడు విళుపురం జిల్లాలోని విక్రవాండి సమీపంలో ఆదివారం నిర్వహించిన సంగతి తెలిసిందే. న భూతో న భవిష్యతీ అన్నట్లుగా జరిగిందంటున్న ఈ కార్యక్రంమం కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

దీంతో... సుమారు 10 నుంచి 20 కిలోమీటర్ల మేర వాహనాల బారులు కనిపించిన పరిస్థితి. ఈ స్థాయిలో స్పందనను ముందే ఊహించారో ఏమో కానీ.. ఇక్కడ ఏకంగా 6వేల మందికి పైగా పోలీసులను నియమించారు! మరోవైపు అత్యవసర సేవల కోసం 22 అంబులెన్సులు, 18 వైద్య బృందాలను పరిసరాల్లో ఉంచారు.

ఈ సభ అత్యంత ఘన విజయం సాధించడంతో తమిళనాట టీవీకే పార్టీ గురించిన బలమైన చర్చ మొదలైందని అంటున్నారు. ఈ సమయంలో దళపతి జోసెఫ్ విజయ్ కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలతో పాటు, తమ మద్దతు కూడా తెలుపుతున్నారు. ఈ సందర్భంగా... విజయ్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

అవును... తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, తమిళ సూపర్ స్టార్ విజయ్ కు.. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా... సాధువులు & సిద్ధుల భూమి అయిన తమిళనాడులో రాజకీయ యాత్రను ప్రారంభించినందుకు శుభాకాంక్షలు చెప్పారు.

మరోపక్క తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా విజయ్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఇందులో భాగంగా... ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టోచ్చని, ఈ సందర్భంగా తన చిరకాల మిత్రుడు విజయ్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. నిర్మాతగా తాను మొదట నిర్మించింది విజయ్ సినిమానే అని గుర్తుచేశారు.

ఇదే సమయంలో... నటుడు విజయ్ కి సీనియర్ నటుడు ప్రభు కూడా శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ కి తన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. విజయ్ ధైర్యంగా పార్టీ ప్రారంభించటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆయన మంచి స్థాయికి రావాలని కాంక్షించారు.



Tags:    

Similar News