పిఠాపురానికి కొత్త కష్టం.. రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్
రెండు వారాల క్రితం మొదలైన వర్షాలు.. చూస్తుండగానే భారీ వర్షాలుగా మారటం.. ఏపీలోని కోస్తాపై విరుచుకుపడిన పరిస్థితి.
ఏపీని పగబట్టిన వరుణుడితో వణికిపోతున్న పరిస్థితి. రెండు వారాల క్రితం మొదలైన వర్షాలు.. చూస్తుండగానే భారీ వర్షాలుగా మారటం.. ఏపీలోని కోస్తాపై విరుచుకుపడిన పరిస్థితి. దానినుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వేళ.. ఉత్తరాంధ్రకు వాన కష్టందాపురించిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఉభయ గోదావరి జిల్లాలకు భారీ వాన ఖాయమని చెప్పిన పరిస్థితి. దీంతో.. ఏ ప్రాంతంలో ఎప్పుడు వరద ముంచేస్తుందన్న భయాందోళనల్లో ప్రజలు ఉన్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితి ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురానికి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటివేళ.. ఇక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు వీలుగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తానే స్వయంగా రంగంలోకి దిగనున్నారు.రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో ఏలేరు రిజర్వాయర్ కు భారీ వర్ష నీరు వచ్చే అవకాశం ఉందంటునానరు. ఈ వరద కారణంగా పిఠాపురానికి వరద ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు.
రిజర్వాయర్ గరిష్ఠ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 20టీఎంసీల వరద నీరు వచ్చి చేరినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలను మొదలుపెట్టాలని అధికారుల్ని కోరారు. అదే సమయంలో చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సంబంధిత అధికారులు సూచన చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురం వ్యవహారాల్ని తానే దగ్గరుండి చూసుుకోవటానికి వీలుగా పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా సోమవారం కాకినాడలో పర్యటించనున్నారు.
ఇప్పటికే కాకినాడ కలెక్టర్ తో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించిన పవన్ పలు సూచనలు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని జగనన్న కాలనీ.. సూరంపేట కాలనీ.. కోలంక.. మాదాపురం.. నవఖండ్రవాడ ప్రాంతాలకు వరద ముప్పు ఉందన్న వాదన నేపథ్యంలో అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఏలేరు వరద ముప్పు నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో పరిస్థితుల్ని తానే స్వయంగా తెలుసుకోవాలని పవన్ డిసైడ్ అయ్యారు. దీంతో.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టూర్ ఉత్కంటగా మారింది.