ప్లీనరీ తరువాత పవన్ వేరే లెవెల్...అక్కడ నుంచే ?
అంతే కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచి నిలిచిన చోటు పిఠాపురంలో పవన్ సొంతంగా కొన్న భూములలో ఈసారి ప్లీనరీ అంగరంగ వైభవంగా జరగనుంది.
ఈ నెల 14న జనసేన ప్లీనరీ జరగనుంది. ఈసారి జనసేనకు ఇది వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి జరుగుతున్న ప్లీనరీ ఇది. అంతే కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచి నిలిచిన చోటు పిఠాపురంలో పవన్ సొంతంగా కొన్న భూములలో ఈసారి ప్లీనరీ అంగరంగ వైభవంగా జరగనుంది. తొలుత మూడు రోజుల పాటు ప్లీనరీ అనుకున్నారు.
కానీ ఈ నెల 14న ఒక్కరోజే ప్లీనరీ సాగనుంది. ఉదయం పార్టీ సమావేశాలు ఉంటాయి. సాయంత్రం భారీ బహిరంగసభతో జనాలను ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తారు అని అంటున్నారు. దాంతో ప్లీనరీ ముగుస్తుంది. ఈ ప్లీనరీలో సంచలన నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. వైసీపీ మీద తన రాజకీయ సమరానికి సంబంధించి పవన్ కీలక వ్యాఖ్యలు చేసే చాన్స్ ఉందని అంటున్నారు.
అంతే కాదు ఏపీలో కూటమి మరిన్ని ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికను ప్రకటిస్తారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ మార్చి తరువాత ముగిసే బడ్జెట్ సెషన్ అనంతరం జిల్లాల టూర్లకు ప్లాన్ చేశారు అని అంటున్నారు.
ఈ జిల్లా టూర్లకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు అని అంటున్నారు. వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమ నుంచే పవన్ జిల్లా టూర్లు ఉంటాయని చెబుతున్నారు. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయినా అత్యధిక స్థానాలలో తక్కువ ఓట్లతోనే ఓటమి పాలు అయింది. వైసీపీకి ఏపీ వ్యాప్తంగా ఓటు షేర్ 40 శాతం వచ్చింది అంటే దానికి రాయలసీమలో పార్టీ బలమే కారణం అని అంటున్నారు.
ఇక కోస్తా జిల్లాలలో టీడీపీ జనసేన బలంగా ఉన్నాయి. దాంతో రాయలసీమతో పాటు గ్రేటర్ రాయలసీమగా ఉన్న నెల్లూరు ప్రకాశం మీద జనసేన ఫోకస్ పెడుతోందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి వైసీపీ బలం పెరగకుండా అధికారంలోకి రాకుండా చేయాలన్నది జనసేనాని రాజకీయ వ్యూహమని అంటున్నారు.
అంతే కాదు ఏపీలో మరిన్ని సార్లు కూటమి రావాలన్నా జనసేన తన రాజకీయ బలాన్ని పెంచుకుని ఏపీలో ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ గా ఎదగాలన్నా కూడా వైసీపీ బలహీనపడడం మార్గం అన్న లెక్క కూడా ఉంది అని అంటున్నారు. దాని కోసం టీడీపీ జనసేన ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయని అంటున్నారు.
ఒక వైపు వైసీపీ నేతలను ఎవరి అవకాశాలను బట్టి వారు చేర్చుకుంటూ అలాగే ఒకరికి ఒకరు ఇబ్బంది కాకుండా వీలైనంత వరకూ రెండు పార్టీలూ బలపడేలా ఈ వ్యూహాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో రాయలసీమనే పవన్ టార్గెట్ గా చేసుకున్నారని అంటున్నారు.
ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో రెండు మూడు అధికారిక పర్యటనలను కూడా అక్కడ నిర్వహించారు అని గుర్తు చేస్తున్నారు. వీలైతే క్యాంప్ ఆఫీసు కూడా కడపలో పెడతాను అని ఊరకే చెప్పలేదని అంటున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కూడా రాయలసీమలో పెద్ద ఎత్తున ఉండడంతో సామాజిక సమీకరణల ఆసరాతో రాజకీయ సమరం సాగించాలని రెడీ అవుతున్నారని చెబుతున్నారు.
రాయలసీమలోని కడప కర్నూలు, చిత్తూరు అనంతపురం జిల్లాలలో ఎక్కువగా పవన్ టూర్లు ఉంటాయని అంటున్నారు. అక్కడ టీడీపీలో చేరలేని వారిని జనసేన వైపుగా ఆకట్టుకోవడమే ఈ టూర్ల ఉద్దేశ్యంగా ఉంది అని అంటున్నారు. ఇక వైసీపీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పవన్ చేపట్టే ఈ జిల్లా టూర్లు ఏ రకమైన ఫలితాలను ఇస్తాయన్నది చూడాల్సిందే అంటున్నారు.