పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి... ఎవరీ మల్లికార్జునరావు?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు పేషీకి ఫోన్ కాల్స్ చేయడం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-10 13:21 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు పేషీకి ఫోన్ కాల్స్ చేయడం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇలా ఫోన్ కాల్స్ చేసి బెదిరించడంతో పాటు మెసేజ్ లు కూడా పంపించాడని అంటున్నారు. ఈ వ్యవహారంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు.

అవును... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు ఫోన్ కాల్స్ చేయడం, మెసేజ్ లు పెట్టడం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని ఆయన పేషీలోని సిబ్బంది పవన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం.. పోలీసు ఉన్నతాధికారులకు వెల్లడించారు.

దీంతో... కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఈ బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి మల్లికార్జునరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే... నిందితుడు మద్యం మత్తులో ఉండి బెదిరింపు కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఇతన్ని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారని కథనాలొస్తున్నాయి.

పవన్ కల్యాణ్ పేషీకి కాల్ వచ్చిన నెంబర్ 95055 05556 అని గుర్తించిన పోలీసులు.. ఈ నెంబర్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జున రావు పేరుతో ఉందని తేల్చారట. ఇదే సమయంలో కాల్ వచ్చిన టవర్.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దది అని తేలిందని అంటున్నారు.

అయితే... ఈ వ్యవహారంపై టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్ విభాగాలకు చెందిన పోలీసులతో నాలుగు బృందాలను ఏర్పాటు చేసినా.. గుర్తించడం కష్టంగా మరిందని అంటున్నారు. దానికి కారణం.. ఫోన్ స్విచ్చాఫ్ చేయడమే అని తెలుస్తోంది. ఈ సమయంలో నిందితుడిని గిరువూరులో అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు ఏపీ హోంమంత్రి అనిత పేషీకి ఈ నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని.. ఈ విషయాన్ని అనిత పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారని అంటున్నారు! దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News