తెలంగాణ ప్రచారంలో జనసేనానికి చేదు అనుభవం.. చెప్పు విసిరిన వ్యక్తి!
ఈ ప్రసంగం అనంతరం.. ఆయన బయలు దేరు తుండగా.. ఓ వ్యక్తి గుంపులోంచి దూసుకువచ్చి.. రెండు చెప్పులనూ పవన్ కళ్యాణ్‌పైకి విసిరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి.. పవన్ కళ్యాణ్‌పై చెప్పు విసిరారు. అయితే.. అదితృటిలో గురితప్పి.. ఆయన కాన్వాయ్‌కు తగిలింది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన పవన్ అభిమానులు.. జనసేన కార్యకర్తలు.. సదరు చెప్పు విసిరిన వ్యక్తిని గుర్తించి పట్టుకుని చితక్కొట్టి.. మరీ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారి తీసింది.
తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపిన పవన్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థుల పక్షాన ప్రచారం చేస్తున్నారు. బుదవారం ప్రారంభించిన ఈ ప్రచారం గురువారం కూడా కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో కలిసి రోడ్ షో చేశారు. అనంతరం ప్రసంగించారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రసంగం అనంతరం.. ఆయన బయలు దేరు తుండగా.. ఓ వ్యక్తి గుంపులోంచి దూసుకువచ్చి.. రెండు చెప్పులనూ పవన్ కళ్యాణ్‌పైకి విసిరారు. అయితే, అప్పటికే ఆయన కారులో కూర్చుని డోర్ వేసుకున్నా రు. దీంతో ఓ చెప్పు ఆయన కారుకు తగిలింది. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ జనసేన కార్యకర్తలు.. సదరు వ్యక్తిని పట్టుకుని చితక్కొట్టారు. అనంతరం.. పోలీసులకు అప్పగించారు. కాగా.. చెప్పు విసిరిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మద్దతు దారుడని.. ఏపీ సీఎం జగన్‌కు అభిమాని అని జనసేన నాయకులు చెబుతున్నారు.