ఫస్ట్ టైం పవన్ మీద తీవ్ర ఆరోపణలు చేసిన జగన్...!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విపక్షాల మీద విమర్శలు పెద్ద ఎత్తున ఎక్కు పెడుతున్నారు

Update: 2024-01-03 08:02 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విపక్షాల మీద విమర్శలు పెద్ద ఎత్తున ఎక్కు పెడుతున్నారు. ఆయన జిల్లా పర్యటనల జోరు కూడా పెంచుతున్నారు. బుధవారం కాకినాడలో జరిగిన సభలో జగన్ చంద్రబాబు పవన్ ల మీద ఘాటు కామెంట్స్ చేశారు. ఇందులో విశేషం ఏంటి అంటే పవన్ మీద గతంలో ఎన్నడూ చేయని కామెంట్స్ జగన్ చేయడం.

పవన్ అనగానే దత్తపుత్రుడు అని ప్యాకేజీ స్టార్ అని మ్యారేజీ స్టార్ అని మాత్రమే జగన్ విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే మొదటిసారి మాత్రం జగన్ పవన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ మీద అవినీతి ఆరోపణలు చేస్తూ జగన్ మాట్లాడడం సంచలనం రేపుతోంది. నిజానికి చూస్తే పవన్ 2014 నుంచి 2019 ల మధ్యలో టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి పదవి తీసుకోలేదు.

ఆయన జస్ట్ టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు అంతే. అయిఏ టీడీపీ ప్రభుత్వం నాడు తీసుకున్న ప్రతీ నిర్ణయం వెనక చంద్రబాబు ఉన్నారు. ఆయన ప్రభుత్వం అవినీతి చేసింది అని వైసీపీ ఆరోపిస్తోంది. దాని మీద కేసులు కూడా ఏపీ సీఐడీ పెడుతోంది. అదంతా ఓకే కానీ చంద్రబాబు అవినీతో పవన్ కి భాగస్వామ్యం ఉంది అనడమే ఇపుడు హైలెట్ పాయింట్.

పవన్ మీద విమర్శల దాడిని పెంచిన జగన్ ఈసారి మాత్రం అవినీతి ఆరోపణలే చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అయిదేళ్ల పాటు చేసిన అవినీతిలో పవన్ కి భాగస్వామ్యం ఉందని జగన్ హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు అవినీతి మీద పవన్ మాట్లాడకపోవడాన్ని కూడా ఆయన గుర్తు చేస్తూ తప్పు పట్టారు.

చంద్రబాబు ఇచ్చిన హామీలకు తాను పూచీకత్తు అని చెప్పిన పవన్ వాటి గురించి ఆనాడు ఎక్కడా బాబు ప్రభుత్వాన్ని నిలదీయలేదని జగన్ మండిపడ్డారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన బాబుని జైలుకు కూడా వెళ్ళి పరామర్శించారు అంటే ఆయనకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లే కదా అని జగన్ అంటున్నారు.

ఆనాడు చంద్రబాబు పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదని దాన్ని అడగాల్సిన పవన్ ఎక్కడా మాట్లాడలేదని, పైగా వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పేదల ఇళ్ల విషయంలో అవినీతి జరిగిందంటూ కేంద్రానికి లేఖ రాశారని జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ పేదలకు ఇస్తున్న ఇళ్ళ నిర్మాణం ఆపాలన్నదే పవన్ ఆలోచన అని ముఖ్యమంత్రి విమర్శించారు. ఇలా చంద్రబాబు అవినీతిలో భాగస్వామి కాబట్టే ఏనాడూ పవన్ విమర్సించలేదని జగన్ లాజిక్ పాయింట్ ని తీసి మరీ జనం ముందు పెట్టారు.

చంద్రబాబు పవన్ ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజల మద్దతు తనకు ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని జగన్ అన్నారు. మొత్తానికి చూస్తే పవన్ మీద అవినీతి ఆరోపణలు ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ ఫస్ట్ టైం చేసి సంచలనం రేపారు. దీనికి జనసేన నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News