భార్యాపిల్లల ముంగిటే..ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ ఇంట్లో నిలువు దోపిడీ

దీంతో ఆ క్రికెటర్ ఇప్పుడు తనకు సాయం చేయమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

Update: 2024-10-31 10:52 GMT

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ నిలువు దోపిడీకి గురయ్యాడు. ఉన్నదంతా ఊడ్చిపెట్టేయడం కాదు కానీ.. అంతకుమించిన విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే, ఇదంతా రెండు వారాల కిందటే జరిగింది. కానీ.. అతడు ఇప్పుడు బయటపెట్టాడు. ముసుగు ధరించిన దొంగలు.. ఆ క్రికెటర్ భార్యాపిల్లలు ఇంట్లోనే ఉండగా దోపిడీకి పాల్పడడం గమనార్హం. దీంతో ఆ క్రికెటర్ ఇప్పుడు తనకు సాయం చేయమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

అతడు పాకిస్థాన్ లో..

ఇటీవల ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ లో పర్యటించింది. మూడు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్ లో నెగ్గినా మిగతా రెండు ఓడిపోయింది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పాకిస్థాన్ వెళ్లాడు. కానీ, గాయం కారణంగా తొలి టెస్టులో పాల్గొనలేదు. అయితే, ఇదే సమయంలో స్టోక్స్ ఇంట్లో చోరీ జరిగిందట. విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని.. ఇవిగో అవి అంటూ కొన్ని వస్తువుల ఫొటోలను అతడు తాజాగా షేర్ చేశాడు. కాగా, స్టోక్స్ ప్పినదాని ప్రకారం అక్టోబరు 17న నార్త్ ఈస్ట్ ఇంగ్లండ్‌ లోని కాస్టల్‌ ఈడెన్ ఏరియాలో ఉన్న అతడి ఇంట్లో చోరీ జరిగింది. ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు..స్టోక్స్ భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే దోపిడీకి తెగబడ్డారు. అయితే, వారికి ఎలాంటి హానీ చేయలేదని స్టోక్స్ తెలిపాడు. ఈ ఘటన వారిపై తీవ్ర మానసిక ప్రభావం చూపిందన్నాడు.

ఈ వస్తువులు అమూల్యం.. తెచ్చివ్వండి ప్లీజ్

దొంగలు ఎత్తుకెళ్లిన వస్తువులు తనకు ఎంతో అమూల్యమని స్టోక్స్ వాపోయాడు. నగలతో పాటు తనకు, తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉన్న వస్తువులను ఎత్తుకెళ్లారని పేర్కొన్నాడు. వాటిని వేటితోనూ భర్తీ చేయలేమని తెలిపాడు. ఎత్తుకెళ్లినవారు వాటిని తీసుకొచ్చి ఇవ్వాలని కోరాడు. స్టోక్స్ చెబుతున్నదాని ప్రకారం డిజైనర్‌ బ్యాగ్, క్రికెట్‌ లో అందించిన సేవలకు గౌరవార్థంగా ఇచ్చిన మెడల్‌ కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. విలువ కట్టలేని వస్తువులు కోల్పోయానని.. అవి దొరికినవారు తెచ్చిస్తారనే ఆశతో వాటి ఫొటోలను షేర్ చేస్తున్నట్లు చెప్పాడు.

Tags:    

Similar News