సినిమా ఇండస్ట్రీ అందుకే స్పందించలేదు... పవన్ క్లారిటీ!
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం, అరెస్ట్ అంశాలపై రాఘవేంద్రరావు, అశ్వనీద త్ మొదలైన పెద్దలు స్పందించిన సంగతి తెలిసిందే
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు సెప్టెంబర్ 9 ఉదయం అరెస్టైన సంగతి తెలిసిందే. అనంతరం 24 గంటల్లో చంద్రబాబును ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచింది ఏపీ సీఐడి. అనంతరం కోర్టు చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాం డ్ విధించింది. ఈ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలెవరూ ఈ విషయాన్ని ఖండించలేదనే కామెంట్లు టీడీపీ శ్రేణుల నుంచి బలంగా వినిపించాయి. ఈ కామెంట్లపై ఇండస్ట్రీ పెద్దలు స్పందించారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం, అరెస్ట్ అంశాలపై రాఘవేంద్రరావు, అశ్వనీద త్ మొదలైన పెద్దలు స్పందించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టును వారు ఖండించారు. ఇక నిర్మాత కేఎస్ రామారావు అయితే ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ సమయంలో సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు ఈ ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన కుండబద్దలు కొట్టినంతపనిచేశారు!
ప్రతీవిషయంపైనా ఇండస్ట్రీ స్పందించదని.. ముఖ్యంగా రాజకీయాలు, పతమరమైన విషయాలు వంటి సున్నితమైన అంశాలపై సినిమా ఇండస్ట్రీ స్పందించదని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా స్పందించలేదని గుర్తు చేశారు. ఇదే విషయాలపై పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. ఇండస్ట్రీకి ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని అన్నారు.
అవును... జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఇటీవల మీడియా ప్రతినిధులు బాబు అరెస్ట్ పై ఇండస్ట్రీ పెద్దల స్పందన గురించి పలు ప్రశ్నలు అడిగిన సంగతి తెలిసిందే. తాజా రాజకీయ పరిణామాలపై ఇండస్ట్రీకి చెందిన వారు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అయితే, తనకు మద్దతుగా స్పందించిన వారిపై వైసీపీ నేతలు విమర్శలు చేసే అవకాశముందని, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ కే ఆ విమర్శలు తప్పలేదని పవన్ తెలిపారు.
ఈ విషయంలో ఇండస్ట్రీ జనాలను ఇబ్బంది పెట్టోద్దని, ఇలాంటి విషయాల్లో స్పందించే విషయంలో ఇండస్ట్రీకి మినహాయింపు ఇవ్వాలని సుటిగా తెలిపారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో ఒక న్యూస్ చానల్ ప్రారంభోత్సవానికి హాజరైన పవన్ కు అదే తరహా ప్రశ్న మరోసారి ఎదురైంది. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై ఇండస్ట్రీ ఎందుకు స్పందించడం లేదని అడిగారు.
ఈ ప్రశ్నలపై స్పందించిన పవన్ కల్యాణ్... ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికి ఇండస్ట్రీ స్పందించాలని కోరుకోవడం సరి కాదని సూచించారు. అలా స్పందించడం తేలికైన విషయం కాదని పవన్ అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు కళాకారులే కానీ... రాజకీయ నాయకులు కాదనే విషయాన్ని గుర్తించాలని పవన్ స్పష్టం చేశారు.
ఇదే సమయంలో... రజనీకాంత్ వంటి వారూ రాజకీయాలపై మాట్లాడలేరని, మాట్లాడితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన సంగతి తెలిసిందేనని గుర్తుచేశారు. ఇక జీవితంలో వినోదం అత్యంత ముఖ్యమైనదని, అందులో సినిమాది అగ్రస్థానం అని పవన్ అభిప్రాయపడ్డారు. సినిమా అనేది సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తుంద.. రఘుపతి వెంకయ్య నాయుడు, గూడవల్లి రామబ్రహ్మంలాంటి వారి ప్రతిభ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.