పొత్తులపైన జగన్ ఫ్యాక్టర్...పవన్ తేల్చేయబోతున్నారా...?
ఏపీ పొత్తుల విషయంలో జగన్ ఫ్యాక్టర్ ఉందా. ఉంటే అది ఏ రూపంలో ఉంది.
ఏపీ పొత్తుల విషయంలో జగన్ ఫ్యాక్టర్ ఉందా. ఉంటే అది ఏ రూపంలో ఉంది. ఎలా ఉంది దాని ప్రభావం ఎంతమేరకు ఉంది అంటే చాలానే అన్నట్లుగా ఏపీలోని రెండు కీలక పార్టీలు టీడీపీ జనసేన భావిస్తున్నాయి. ఎన్డీయే కీలక భేటీకి పాత మిత్రులు బీజేపీని వీడిపోయిన వారిని కూడా పిలిచిన పెద్దలు టీడీపీని పిలవడంలేదు. అదే సమయంలో పవన్ కి పిలుపు వచ్చింది.
ఆయన హాజరవుతూ ఏపీ పొత్తుల గురించి మాట్లాడుతాను అన్నారు. ఇక టీడీపీ అనుకూల మీడియా నుంచి వస్తున్న సమాచారం ఏంటి అంటే పవన్ ఎన్డీయే భేటీలో చాలా విషయాల మీద బీజేపీ పెద్దల నుంచి క్లారిఫికేషన్ తీసుకుంటారు అని అంటున్నారు. ఏపీలో పొత్తులు ఉండాలంటే జగన్ తో బంధాన్ని బీజేపీ వదులుకోవాలని కండిషన్ పెడతారు అని అంటున్నారు.
అయితే దానికి బీజేపీ దగ్గర సమాధానం కూడా ఉంటుందని అంటున్నరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలే ఉన్నయని అంటారు. అలాగైతే ఏపీ ప్రభుత్వం మీద వచ్చిన ఆరొపణల మీద చర్యలు తీసుకోవాలని కోరతారు అని అంటున్నారు. సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీకి వచ్చి వైసీపీ ప్రభుత్వం అవినీతి మయం అని విమర్శించారని, మరి దాని మీద చర్యలు ఉండవా అన్నదే జనసేన నుంచి వస్తున్న ప్రశ్న.
ఏపీలో పొత్తులు అంటే వైసీపీని దించే పొత్తులుగా ఉండాలన్నది పవన్ మొదటి నుంచి చేస్తున్న వాదన. అదే జరగాలీ అంటే ఏపీలో పెద్ద పార్టీగా ఉన్న టీడీపీని కూడా కలుపుకుని పోతేనే సాధ్యపడుతుంది అని అన్నది ఆయన పాయింట్. కానీ బీజేపీ పెద్దలు చూస్తే ఆ విధంగా లేరు అని అంటున్నారు.
ఏపీలో జనసేన టీడీపీ కలసి పోటీ చేయాలన్నది వారై ఆలోచంగా ఉంది అని అంటున్నారు. అక్కడే పవన్ తో బీజేపీ పెద్దలకు తేడా వస్తోంది అని అంటున్నారు. మరి పవన్ ఒక బ్లూ ప్రింట్ ని కూడా ఈ భేటీకి తీసుకెళ్తున్నారు. ఏపీలో పొత్తులు పండాలీ వైసీపీ దిగాలి, అంతా కలసి అధికారంలోకి రావలంటే ఏమి చేయాలో ఆయన చెబుతారు అని అంటున్నారు.
దానికి బీజేపీ నుంచి వచ్చే సమాధానం బట్టే ఎన్డీయే లో జనసేన కొనసాగే విషయం ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. మరి జనసేన బీజేపీ పొత్తులు కొనసాగాలీ అంటే టీడీపీని కూడా కలుపుకుని పోవాలన్న సేనాని ఆలోచనలకు కేంద్ర పెద్దలు ఎంతవరకూ ఆమోదం చెబుతారో చూడాలి.
ఇవన్నీ ఇలా ఉంటే ఢిల్లీ వేదికగా పవన్ ఇక కీలకమైన ప్రకటన చేస్తారు అని అంటున్న్నాయి టీడీపీ అనుకూల మీడియా వార్తలు. మరి పవన్ ఇచ్చే బిగ్ స్టేట్మెంట్ ఏంటి, ఆయన ఏమి కోరుకుంటున్నారు. బీజేపీ వారు ఇచ్చే రోడ్ మ్యాప్ ఏంటి అన్నవన్నీ ఈ భేటీలో తేలిపోతాయని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే ఈ మీటింగ్ తరువాత ఏపీ పాలిటిక్స్ లో ఫుల్ క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.