వైరల్ టాపిక్... పవన్ కు జాగ్రత్తలు చెబుతున్న వైసీపీ!

అందులోకి పలు స్థానాలకు టీడీపీ అభ్యర్థులనే జనసేన కండువా కప్పించి మరీ పోటీ చేయిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో

Update: 2024-03-21 09:18 GMT

"పవన్ ని చూస్తే జాలిపడాలో, కోప్పడాలో తెలియడం లేదు"... చాలా మంది వైసీపీ నేతలు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో పవన్ ఉద్దేశించి ఈమధ్యకాలంలో చెబుతున్న మాటలు! పైగా కూటమిలో భాగంగా జనసేనకు 21 స్థానాలు మాత్రమే కేటాయించడం.. అందులోకి పలు స్థానాలకు టీడీపీ అభ్యర్థులనే జనసేన కండువా కప్పించి మరీ పోటీ చేయిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... పవన్ తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాన్ని ప్రకటించారు.

దీంతో... పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ అనుచరులు, టీడీపీ అభిమానులు నానా హడావిడీ చేశారు! ఇందులో భాగంగా తెలుగుదేశం జెండాలు తగలబెడుతూ, పవన్ పైన దుర్భాషలాడారు! అయితే ఇది పూర్తిగా బాబు అసమర్ధత.. లేక, ఆయన వ్యూహంలో భాగం అని అంటున్నారు పరిశీలకులు. కూటమిలోని పార్టీ అధినేత పోటీ చేస్తున్న స్థానంలో టీడీపీ అభ్యర్థులను ముందుగానే కంట్రోల్ చేయాల్సిన బాద్యత చంద్రబాబుది కాదా అని ప్రశ్నిస్తున్నారు.

మరోపక్క.. తాను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయని పక్షంలో.. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతానని.. తాను కాకినాడ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు పవన్! ఈ స్టేట్ మెంట్ పై వస్తున్న విమర్శల సంగతి కాసేపు పక్కనపెడితే... పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయకపోతే... తానే పిఠాపురం కూటమి అభ్యర్థిని అని వర్మ ప్రకటించారు!! దీంతో వైసీపీ ఎంటరయ్యింది.

అవును... పవన్ అసెంబ్లీకి పోటీ చేస్తే అతన్ని ఓడించేది టీడీపీ కార్యకర్తలే అని, అది చంద్రబాబు ప్లాన్ అని, అసెంబ్లీలో లోకేష్ - పవన్ ఇద్దరూ ఉంటే.. చినబాబు మెయిన్ ఫోకస్ లో ఉండే అవకాశం లేదనేది చంద్రబాబు ప్లాన్ అని కామెంట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు! ఈ సమయంలో పిఠాపురం విషయంలో వర్మ చేసిన వ్యాఖ్యలను ప్రస్థావించిన వైసీపీ... తన అధికారిక ట్విట్టర్ లో పవన్ కు జాగ్రత్తలు చెప్పింది.

తనను కాదని పిఠాపురంలో గెలవడం ఎట్టిపరిస్థితుల్లోనూ కుదరదని.. పవన్ గెలిచినా చంద్రబాబు చెప్పినట్లే నడుచుకోవాలని వర్మ వ్యాఖ్యానించినట్లుగా పత్రికల్లో ప్రచురితమైన ఈ-పేపర్ కటింగ్ ని పోస్ట్ చేసిన వైసీపీ... "జాగ్రత్త పవన్ కల్యాణ్... ఏదన్నా అటూ ఇటూ అయితే పిఠాపురంలో నిన్ను ఓడించేవాళ్లలో మొదటి వరుసలో ఉండేది టీడీపీనే అనుకుంటా... చూస్కో మరి!" అని ట్వీట్ చేసింది. దీంతో... ఈ విషయం వైరల్ గా మారింది!!

Tags:    

Similar News