ఎన్నికల తరువాత పవన్ షాకింగ్ డెసిషన్...!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇది వెండి తెర మీద. జనసేనాని పవన్ ఇది రాజకీయ తెర మీద పేరు.

Update: 2024-01-30 03:47 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇది వెండి తెర మీద. జనసేనాని పవన్ ఇది రాజకీయ తెర మీద పేరు. ఏ రంగం అయినా పవన్ అన్న మూడు అక్షరాలు మాత్రం ప్రకంపనలే పుట్టిస్తాయి. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అంతులేనిది. ఆయన అభిమాన గణం కూడా ఒక సముద్రం వంటిది.

పవన్ కళ్యాణ్ రాజకీయాలను సినీ జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పే ఎన్నికలుగా 2024ని చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి పవన్ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా తెలుగుదేశంతో కూటమి కట్టి మరీ ఎన్నికలకు వెళ్తున్నారు. గెలుపు ఆశలు ఈ కూటమికి చాలా ఉన్నాయి.

గత ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల రెండు పార్టీలు నష్టపోయాయి. ఇపుడు కలసి పోటీ చేస్తే కీలకమైన జిల్లాలలో ఆధిపత్యం ఏకపక్షంగా చలాయించవచ్చు అన్న లెక్కలు వేసుకుని మరీ బరిలోకి దిగుతున్నారు.

దాంతో పవన్ ఈసారి ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్నారు. రాజకీయ ఆశలు కూడా చాలానే పెట్టుకున్నారు. ఈసారి ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి గెలిస్తే పవన్ ఉప ముఖ్యమంత్రిగా అవడం ఖాయమని అంటున్నారు. సీఎం షేరింగ్ ఉంటే మాత్రం రెండున్నరేళ్ళ తరువాత సీఎం కూడా కావచ్చు. ఇదంతా పొత్తులో దక్కే సీట్లు గెలిచే సీట్లను బట్టి ఉంటుంది.

ఏది ఏమైనా కూటమి గెలుస్తుంది అన్న ఆశలతో ఉన్నారు పవన్. అందువల్ల ఆయన కొత్త సినిమాలు ఏవీ కమిట్ కావడంలేదు. ఆయన చేతిలో ఉన్న సినిమాలనే ఆయన పూర్తి చేస్తారు అని అంటున్నారు. ఎన్నికల తరువాత మిగిలిన సినిమాలను కూడా వీలు వెంబడి పూర్తి చేసి ఇక మీదట పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి పవన్ వస్తారు అని అంటున్నారు.

అంటే ఆయన పూర్తిగా ఏపీకి వచ్చి ఇక్కడే తన నివాసం ఏర్పరచుకుని రానున్న కాలమంతా గడుపుతారు అని అంటున్నారు. ఇది పవన్ తీసుకునే షాకింగ్ డెసిషన్ అని అంటున్నారు. పవన్ సినిమాలు మానేయడం అంటే నిజంగా ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి అది చాలా పెద్ద షాక్. కానీ ఆయన రాజకీయాల్లో నిరంతరం కనిపిన్స్తారు.

ఆయన ఏపీకే వచ్చి జనంలోనే ఉంటారు. కాబట్టి ఆ ఇబ్బంది ఉండదని అంటున్నారు. మొత్తానికి చూస్తే 2008 నుంచి రాజకీయాలూ సినిమాలూ అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న పవన్ 2024లో మాత్రం తన జీవితం రాజకీయాలకే అంకితం అని చెప్పబోతున్నారు. ఆయనకు డ్రీమ్ ప్రాజెక్టులు ఏమైనా ఉంటే ఎపుడైనా చేస్తారేమో తప్ప సినీ జీవితానికి మాత్రం ఇక మీదట స్వస్తి అని చెప్పేయబోతున్నారు. సో ఇది పవన్ తీసుకోబోయే షాకింగ్ డెసిషన్ అంటున్నారు.





 


Tags:    

Similar News