సీఎం పదవి కంటే జగనే ఎక్కువ... పవన్ క్లారిటీ ..?

అదే సమయంలో పొత్తుల గురించి కూడా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు కచ్చితంగా జగన్ని గద్దె దించేలా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.

Update: 2023-08-18 17:49 GMT

పవన్ కళ్యాణ్ రాజకీయానికి ఒక అర్ధం పరమార్ధం ఉంది. అదేంటి అంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ గద్దె దిగిపోవడం. ఆయన్ని సీఎం గా కానీయను అని 2019 ఎన్నికల వేళ పవన్ గర్జించారు. ఇది నా శాసనం అన్నారు. కానీ ఏమైంది. జనాలు 151 సీట్ల భారీ మెజారిటీతో వైసీపీని గెలిపించారు. జగన్ని అందలం మీద కూర్చోబెట్టారు. ఇక జగన్ మళ్లీ సీఎం కావాలని చూస్తున్నారు. సర్వేలు కూడా వైసీపీదే 2024లో విజయం అని స్పష్టం చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో జనసేన అధినేత వారాహి యాత్రతో జిల్లాలో టూర్లు చేస్తున్నారు. ఆయన ప్రతీ చోటా తన పార్టీ గురించి చెప్పుకోవడం కంటే జగన్ మీద విమర్శలు చేయడం పైనే దృష్టి పెడుతున్నారు. ఇక గోదావరి జిల్లాలోనే జగన్ని ఇక మీదట ఏకవచనంతో సంబోదిస్తాను అని పవన్ స్పష్టం చేశారు. ఆ మాటకు కట్టుబడి అలాగే పిలుస్తున్నారు. జగన్ అంటూ ప్రతీ చోటా ఆయన మాట్లాడుతున్నారు.

ఇదిలా ఉంటే విశాఖలో వారాహి యాత్ర మూడవ విడత పవన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం పదవి విషయం ప్రజలు తేల్చాల్సిందే అన్నారు. అది ప్రజలు, గెలిచిన ఎమ్మెల్యేల చేతులలో ఉంటుందని అన్నారు. అదే సమయంలో పొత్తుల గురించి కూడా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు కచ్చితంగా జగన్ని గద్దె దించేలా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ జనసేన పొత్తుతోనా లేక బీజేపీ జనసేన టీడీపీ కలసి వస్తాయా అన్నది పక్కన పెడితే జగన్ మాత్రం మాజీ సీఎం అయ్యేలాగానే పొత్తుల అజెండా ఉంటుందని అన్నారు.

సీఎం పదవి విషయంలో ఇంత స్పష్టంగా మాట్లాడని పవన్ పొత్తుల విషయంలో మాత్రం గట్టిగానే చెప్పుకొచ్చారు. జగన్ గద్దె దిగాలన్నదే తన లక్ష్యం అన్నట్లుగానే ఆయన చెబుతున్నారు. ఒక విధంగా జనసేన అధినేత తమ పార్టీ అధికారంలోకి రావడం కంటే ముందు జగన్ దిగిపోతే చాలు అన్నట్లుగా పాలిటిక్స్ చేస్తోంది అని అంటున్నారు. ఏపీలో ఇంతటి విద్వంశ పాలన గతంలో చూడలేదు అని పవన్ అంటున్నారు. ఏపీకి జగన్ సీఎం గా ఇక మీదట ఉండరాదు అని ఆయన మరోశారి శాసిస్తున్నారు.

అందుకోసం ఆయన జనసేన తరఫున ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చబోమని పవన్ ప్రకటించారు. ఏపీలో బలమైన ప్రతిపక్షంగా టీడీపీ ఉంది. దాంతో టీడీపీని కూడా కలుపుకుంటూ బీజేపీ జనసేన పోటీ చేస్తాయని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే సీఎం పదవి కంటే జగన్ ని మాజీ సీఎం చేయడానికే పవన్ ఓటేసారు అని అంటున్నారు. గత ఎన్నికల్లో పవన్ జగన్ని సీఎం ని కానీయను అన్నారు. ఇది నా శాసనం అన్నారు. ఈసారి పంతం పడుతున్నారు మరి ఈసారి అది కుదురుతుందా. ప్రజా తీర్పు అలా ఉండబోతోందా. చూడాల్సి ఉంది.

Tags:    

Similar News