జగన్ వల్లనే తెలంగాణా విడిపోయింది....పవన్ సంచలనం
అలా హైదరాబాద్ లో దౌర్జన్యాలు చేసిన వారిలో ముఖయమైన వ్యక్తి జగన్ అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అందువల్లనే తెలంగాణా వారు విడిపోయారని కొత్త సూత్రీకరణ చేశారు పవన్ కళ్యాణ్.
జగన్ మీద పవన్ కళ్యాణ్ విమర్శల పర్వం కొనసాగుతోంది. ఆయన జగన్ గురించి ఆయన పాలన తీరు తెన్నుల మీద నిశితంగా విమర్శలు చేస్తూ ఉంటారు. విశాఖలో మూడవ విడత వారాహి యాత్ర మొదటి రోజునే పవన్ జగన్ మీద అతి పెద్ద విమర్శ చేశారు. అది కూడా ఇంతకు ముందు ఎన్నడూ చేయని విమర్శగా ఉంది.
జగన్ వల్లనే తెలంగాణా ఏర్పడింది ఏపీ నుంచి విడిపోయింది అంటూ పవన్ చేసిన ఈ విమర్శ సంచలనం రేపుతోంది. తెలంగాణా విడిపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. అందులో రాజకీయ సమాజిక ఆర్ధిక కోణాలు ఉన్నాయని విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే తెలంగాణా విడిపోవడానికి చంద్రబాబు కారణం అని ఇప్పటిదాకా వైసీపీ నేతలు అంటూ ఉంటారు.
కానీ ఫస్ట్ టైం పవన్ జగన్ మీద ఈ ఆరోపణ చేశారు. ఇది కూడా వ్యూహాత్మకంగా చేశారు. తెలంగాణా మీద పడి దౌర్జన్యాలు దోపిడీలు చేస్తూ ఉంటే ఆంధ్రా వాళ్ళను తెలంగాణా ప్రజలు తన్ని తగిలేసారు అని పవన్ ఘాటు విమర్శలు చేసారు.
అలా హైదరాబాద్ లో దౌర్జన్యాలు చేసిన వారిలో ముఖయమైన వ్యక్తి జగన్ అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అందువల్లనే తెలంగాణా వారు విడిపోయారని కొత్త సూత్రీకరణ చేశారు పవన్ కళ్యాణ్. జగన్ని దౌర్జన్యాలు చేసే వారిగా చిత్రీకరించారు. ఏపీలో కూడా దౌర్జన్య పాలన సాగుతోంది అని అన్నారు. అందుకే తాను వైసీపీని తన్ని తరిమేంతవరకూ నిద్రపోను అని ఆయన శపధం చేశారు.
తాను చూడడానికి బక్క పలచగా ఉంటానేమో కానీ తన ఒళ్ళు మందం అని పవన్ చెప్పుకున్నారు. వైసీపీని ఓటేయవద్దు అని తాను 2019 ఎన్నికల్లో చెప్పానని, అలా చేస్తే కొండలను తవ్వేస్తారని కూడా చెప్పానని పవన్ అన్నారు. విశాఖలో రుషికొండ తవ్వాలాని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
జగన్ నాయకుడు కాదు ఫక్తు వ్యాపారి అని పవన్ విమర్శించారు. ఆయనకు డబ్బు పిచ్చి పట్టుకుంది. ఎంత డబ్బు కావాలో కూడా తెలియదు అన్నారు. డబ్బు కట్టలతో తాళింపు వేసి కూర పెడతాను అంటూ భారీ కౌంటర్ వేసారు. ఎంతో ప్రతిష్ట కలిగిన ఏయూని భ్రష్టు పట్టించారని కూడా పవన్ విమర్శించారు. అక్కడ విద్యా వవస్థ సరిగా లేదని అన్నారు. ఏయూని మళ్లీ ప్రక్షాళన చేస్తామని పవన్ పేర్కొన్నారు. మొత్తానికి జగన్ మీద పవన్ ఒక రేంజిలో విమర్శలు చేశారు. ఏపీలఒ వైసీపీ పాలన పోవాల్సిందే అంటూ గర్జించారు.