షారుక్ కొడుకు డ్రగ్స్ కేసుపై పవన్ సంచలన వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా షారుక్ ఖాన్ కొడుకు అరెస్ట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ నిజమే మాట్లాడటానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు అరెస్ట్ అనంతరం రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన కార్యాలయంలో భావోద్వేగంగా మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబుకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంఘా షారుక్ కుమారుడి ప్రస్థావన తీసుకొచ్చారు.
తాజాగా మంగళగిరి పార్టీ ఆఫీసులో పార్టీ పీఏసీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో మైకందుకున్న పవన్ కల్యాణ్... ఏపీలో గంజాయి, డ్రగ్స్ దాందా జరుగుతుందంటూ మాట్లాడారు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ కొడుకు అరెస్ట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ నిజమే మాట్లాడటానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు.
అవును... తాజగా డ్రగ్స్ గురించి మాట్లాడిన పవన్ ఈ సందర్భంగా షారుక్ ఖాన్ కొడుకును డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తే.. ఇదే వేదికపైనుంచి ఖండించినట్లు తెలిపారు. ఇదేదో మైనారిటీల మద్దతు గురించి మాట్లాడిన అంశం కాదని అన్నారు. ఇలా తాను ఆర్యన్ అరెస్ట్ ను ఖండిస్తే.. మాదక ద్రవ్యాల కేసును ఎలా ఖండిస్తావు అని కొందరు ప్రశ్నించారని చెప్పుకొచ్చారు.
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకోలేదనే కటిక నిజం కళ్లముందు కనిపిస్తున్నప్పుడు.. ఖండించకుండా ఎలా ఉంటాను అని తెలిపిన పవన్ కల్యాణ్... అతడు తప్పు చేశాడా లేదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయని చెప్పారు. ఇదే క్రమంలో తాను షారుక్ ఖాన్ కు అండంగా నిలిస్తే బీజేపీ నాయకులు బాధపడుతారని కూడా ఆలోచించినట్లు పవన్ చెప్పుకొచ్చారు.
నాడు ఆర్యన్ ఖాన్ ఉండే ప్రదేశంలో తన స్నేహితుల వద్ద 35గ్రాముల డ్రగ్స్ ఉన్నందుకే అతడిని నెలరోజులు జైలుకు పంపించారని తెలిపిన పవన్... ఏపీలో ఎక్కడా లభించనంతగా గంజాయి పట్టుబడినా దాని గురించి మీడియా మాట్లాడదని, ఒక్క వార్త కూడా ప్రసారం చేయదని చెప్పడం గమనార్హం.