పవన్ ప్రత్యర్ధి అత్యంత బలవంతురాలు ..!
తన లీడర్ షిప్ క్వాలిటీస్ ని విద్యార్థి దశలోనే అలా పెంచుకున్నారు
వంగా గీత. సాధారణ రాజకీయ నాయకురాలు కాదు. ఆమె ప్రతిభా పాటవాలు నాయకత్వ లక్షణాలు విద్యార్థి దశలోనే కనిపించాయి. ఆమె స్కూల్ పీపుల్ లీడర్ నుంచి తన దక్షత చాటుకుంటూ వచ్చారు. ఆమె ఎన్సీసీ ఎన్ ఎస్ ఎస్ లలో కూడా పాల్గొని గోదావరి జిల్లాలలో ముందు వరసలో ఉన్నారు. బెస్ట్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్నారు. తన లీడర్ షిప్ క్వాలిటీస్ ని విద్యార్థి దశలోనే అలా పెంచుకున్నారు
ఆమె 1983 నుంచి పాలిటిక్స్ లో ఉంటున్నారు. ఆమె 1985 నుంచి 87 వరకూ మహిళా శిశు సంక్షేమ రీజనల్ చైర్ పర్సన్‌గా పనిచేశారు. ఎన్టీఆర్ జమానాలో అలా ఆమె కీలక పదవిలో రాణించారు. ఆమె 1995లో కొత్తపేట జెడ్పీటీసీగా గెలిచిన తరువాత 1995 నుంచి 2000 వరకూ తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్‌గా పని చేశారు. ఆ పదవి నుంచి ఆమె అలా 2000 నుంచి 2006 వరకూ రాజ్యసభ సభ్యురాలిగా పెద్దల సభలో పిన్న వయసులో పనిచేసిన అనుభవం సంపాదించారు.
ఇక్ల ఆమె 2009 నుంచి 2014 వరకూ పిఠాపురం ఎమ్మెల్యేగా పని చేశారు. ఆమె 2019లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచింది. ఇక్కడ చూస్తే ఆమె గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్ దాకా పనిచేసిన తీరు కనిపిస్తుంది. అంతే కాదు దేశంలో ఉన్న రెండు చట్ట సభలలోనూ ఆమె మెంబర్ గా ఉన్నారు. అసెంబ్లీలో పనిచేశారు. ఆమె ప్రవేశించనిది శాసనమండలిలో మాత్రమే.
ఆమె క్షేత్రస్థాయి నుంచి పనిచేయడంతో ఆమెకు ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా ఆమె ప్రజలకు అందుబాటులో ఉంటారు అన్న పేరు తెచ్చుకున్నారు. ఆమె వ్యూహాలు కూడా అలాగే ఉంటాయి. పిఠాపురంలో ఆమె ఎవరు వచ్చినా పలికే నేతగా కనిపిస్తారు.
ఆమె విద్యాధికురాలు అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె బీఎల్ పట్టాను ఏయూ నుంచి పొందారు. అంతే కాదు ఆమె ఎంఎల్ పట్టాను నాగ్ పూర్ లో అందుకున్నారు. కొన్నాళ్ళ పాటు ఆమె న్యాయవాదిగానూ పనిచేశారు. అంతేనా ఆమె ఎంఏ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో చేశారు. సైకాలజీలో ఎమ్మెసీ చేశారు. ఇలా మూడు పీజీలు ఆమె చేసి ఉన్నత విద్యావంతురాలుగా ఉన్నారు.
ఆమె టీడీపీలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేసి కీలకంగా రాజకీయాల్లో పాలుపంచుకున్నారు. ఇక్కడ మరో విషయం చెప్పాలి. ఆమె ఓటమి ఎరుగని వారు. పోటీ చేసిన ప్రతీసారి ఆమె గెలుస్తూ వస్తున్నారు. మరి పవన్ ప్రత్యర్థిగా పిఠాపురంలో వంగా గీతను నిలబెట్టడం ద్వారా జగన్ బెస్ట్ ఛాయిస్ అనిపించారు. జనాలు కూడా అదే అంటే మాత్రం ఆమె విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదనే అంటున్నారు.