జగన్ జాతకం చెప్పిన పయ్యావుల !

టీడీపీ మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ అధినేత జగన్ జాతకాన్ని విప్పి చెప్పారు. జగన్ భారీ ఓటమితో ప్రస్తుతం ఉన్నారు

Update: 2024-06-27 01:30 GMT

టీడీపీ మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ అధినేత జగన్ జాతకాన్ని విప్పి చెప్పారు. జగన్ భారీ ఓటమితో ప్రస్తుతం ఉన్నారు. అయితే ఆయన ఆశలన్నీ 2029 మీద ఉన్నాయి. ఈసారి ఓడితే ఏమైంది 2029లో భారీ విజయాన్ని చాలా గట్టిగానే కొడతామని ఆయన క్యాడర్ కి ధైర్యం చెబుతూ తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నారు.

అటువంటి జగన్ మీద టీడీపీలో ఏ రాజకీయ నాయకుడు అనని మాటలనే పయ్యావుల అన్నారు. జగన్ జాతకం గురించి చెప్పాల్సింది చెప్పేశారు. వైసీపీకి 11 సీట్లు దక్కాయని అవి కూడా విపక్ష స్థానానికి సరిపడవని ఆయన అంటూ ప్రతిపక్ష స్థానానికి సరిపడా 18 ఎమ్మెల్యే సీట్లు జగన్ సంపాదించడానికి పదేళ్ళు కచ్చితంగా పడుతుందని అన్నారు.

అంటే 2034 నాటికి జగన్ కి 18 సీట్లు వస్తాయన్న మాట. మరి జగన్ సీఎం రెండోసారి అయ్యేది లేనే లేదు అన్నట్లుగానే పయ్యావుల కఠినమైన రాజకీయ విశ్లేషణ చేశారు. జగన్ 88 సీట్లు సాధించడం ఇలాగైతే ఎపుడు జరుగుతుంది ఆయన పవర్ పట్టడానికి మ్యాజిక్ నంబర్ 88కి రీచ్ కావాలంటే 18 నుంచి ఎత్తి గిల్లేది ఎపుడు అన్న ప్రశ్న ఇపుడు వస్తోంది.

దీనిని బట్టి చూస్తే వైసీపీ ఇక అధికారానికి శాశ్వతంగా టాటా చెప్పాల్సిందేనా అన్నది కూడా చర్చ సాగుతోంది. దీనిని కారణం తాజా ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు. 164 సీట్లు కూటమి సాధించింది. ఎంతో ఘోరమైన తప్పులు చేస్తే తప్ప ఈ నంబర్ తిరగబడదు, ఏ మాత్రం ఇబ్బంది వచ్చినా ఏ కొన్ని సీట్లో తగ్గుతయి తప్ప 2029లో కూడా కూటమిదే అధికారం అన్న ధీమా టీడీపీలో కనిపిస్తోంది.

వైసీపీకి కూసాలు కదిలిపోయేలా ఫలితాలు రావడంతో జీరో నుంచి స్టార్ట్ చేసి టీడీపీ కూటమి వంటి బలమైన శక్తుల మీద పోరాడాలంటే చాలా కాలం పడుతుంది అన్నదే పసుపు శిబిరం అంచనా. ఈ లోగా రాజకీయాలు పూర్తిగా మారుతాయి కాబట్టి అది టీడీపీకే ఫేవర్ గా ఉండొచ్చు తప్ప వైసీపీకి ఏ విధంగానూ కలసిరాదు అన్న అంచనాలూ ఉన్నాయని అంటున్నారు.

ఫలితాలు వచ్చిన తరువాత రాజకీయ విశ్లేషకులు తటస్థులలో కూడా వైసీపీ భవితవ్యం మీద చర్చ అనేది మొదలైంది.ఇలాంటి వాటిని లెక్క వేసుకుంటూనే పయ్యావుల వంటి వారు వైసీపీకి ఇక నో ఫ్యూచర్ అని తేల్చేశారు అంటున్నారు. జగన్ విపక్ష హోదా కోసం లేఖ రాస్తే ఇక వైసీపీకే రాజకీయ హోదా కష్టమన్నట్లుగా టీడీపీ నేతలు స్పందిస్తున్న తీరు ఫ్యాన్ పార్టీ నేతలను కలవరపెడుతోంది. అయినా చేసేది ఏమీ లేదు. దేనికైనా జనంలోనే తేల్చుకోవాలి. ఆ విధంగానే ఈ విమర్శలకు జవాబు చెప్పాలి. మరి అలాంటి అవకాశం రావాలి. వైసీపీ కూడా బలం కూడగట్టుకోవాలి. అంతవరకూ ఇలాంటి జాతకాలను కర్ణ కఠోరమైనా విని తీరాల్సిందే.

Tags:    

Similar News