ఆ పెంట్ హౌస్ ఖరీదు ఎంతో తెలుసా?

గాల్లో మేడలు కడుతున్నావా అంటారు. కానీ వాస్తవంగా కూడా అలాంటి నిర్మాణాలు దుబాయ్ లో కోకొల్లలు. దుబాయ్ లో అత్యంత ఖరీదైన ఫామ్ హౌస్ జుమేరియా.

Update: 2023-12-07 06:40 GMT

గాల్లో మేడలు కడుతున్నావా అంటారు. కానీ వాస్తవంగా కూడా అలాంటి నిర్మాణాలు దుబాయ్ లో కోకొల్లలు. దుబాయ్ లో అత్యంత ఖరీదైన ఫామ్ హౌస్ జుమేరియా. ఇది 71 అంతస్తుల్లో కడుతున్నారు. చూస్తే ఆకాశహర్మంపై ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలాంటి గగనతలంలో పెంట్ హౌస్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాని ఖరీదు ఎంతో తెలిస్తే షాకే. రూ.1,133 కోట్లతో ఈపెంట్ హౌస్ నిర్మిస్తుండటం విశేషం. ఓ ప్రముఖ రియల్టర్ ఈ పెంట్ హౌస్ ను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ ధర పలికిన పెంట్ హౌస్ గా రికార్డు సాధించింది. ఇది 22 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.

2027లో కోమో టవర్ నిర్మాణం పూర్తయ్యాక ఇది కొనుగోలుదారుకు దక్కనుంది. దీని వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. దీన్ని కొనుగోలు చేసిన కుబేరుడు తూర్పు యూరప్ ప్రాంతానికి చెందిన వాడుగా చెబుతున్నారు. దుబాయ్ లో అపార్ట్ మెంట్లు, ప్లాట్లు, విల్లాలు, పెంట్ హౌస్ ల ధరలు చుక్కలనంటడం కొత్తేమీ కాదు. వాటితో పోల్చుకుంటే ఇది మూడో పెంట్ హౌస్ గా చెబుతున్నారు. కొంత కాలం క్రితం మర్సా ఆల్ అరబ్ హోటల్ పెంట్ హౌస్ ఏకంగా రూ. 956 కోట్లకు విక్రయించడం విశేషం.

ఇందులో కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. 360 డిగ్రీల స్కై ఫూల్ ఉంటుంది. దీనిపై నుంచి చూస్తే ప్రపంచంలోకెల్లా ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా, బుర్గ్ ఆల్ అరబ్, దుబాయ్ మరీనా వంటి వాటిని చూడొచ్చు. కోమో రెసిడెన్సెస్ టవర్ ఎత్తు 300 మీటర్ల కంటే ఎక్కువే. రెండు నుంచి ఏడు పడక గదులతో కూడుకున్న లిఫ్టులు, శాండీ బీచ్ లు, 25 మీటర్ల లాప్ ఫూల్స్, రూఫ్ టాప్ ఇన్ఫిలిటీ ఫూల్ వంటివి చాలా సదుపాయాలుంటాయి. ఈ ప్లాట్ల ధర రూ. 47 కోట్ల నుంచి మొదలవుతుంది.

మొనాకోలోని ఓడియన్ టవర్ పెంట్ హౌస్ రూ.3,670 కోట్లతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు సాధించింది. లండన్ లోని వన్ హైడ్ పార్క్ హౌస్ రూ.1,975 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇలా అత్యంత ఖరీదైన పెంట్ హౌస్ లు కొనుగోలు చేయడానికి చాలా మంది చొరవ చూపిస్తుంటారు. అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉండటం వల్ల వారికి ఎంజాయ్ మెంట్ దొరుకుతుంది.

ఇలా పెంట్ హౌస్ ల కోసం చాలా మంది డబ్బు ఖర్చు చేస్తూ కొంటారు. అక్కడ ఉండటం ఎంతో హాయిగా అనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉంటే చూడటానికి గమ్మత్తుగా అనిపిస్తుందని చెబుతారు. అందుకే ఇలాంటి పెంట్ హౌస్ లు కొనేందుకు మొగ్గు చూపుతారు. ఎంత ఖర్చయినా ఫర్వా లేదని భావిస్తూ వాటిని సొంతం చేసుకుంటారు.

Tags:    

Similar News