పిల్లిమొగ్గలు ఎన్నేసినా .. పిన్నెల్లికి తప్పలేదుగా !

పాల్వాయి గేటు దగ్గర ఈవీఎం ధ్వంసంతో సహా పలు కేసుల్లో గతంలో ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఇచ్చిన తీర్పును కోర్టు డిస్మిస్ చేసింది.

Update: 2024-06-26 14:19 GMT

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ పిటీషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి నరసరావుపేట ఎస్పీ ఆఫీసుకు తరలించారు. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు, ఎన్నికల సమయంలో అల్లర్లు, తదితర కేసులు ఉన్నాయి. పాల్వాయి గేటు దగ్గర ఈవీఎం ధ్వంసంతో సహా పలు కేసుల్లో గతంలో ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఇచ్చిన తీర్పును కోర్టు డిస్మిస్ చేసింది.

మే 13న జరిగిన ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు దగ్గర ఈవీఎంను ధ్వంసం చేశారు. అనంతరం కొన్ని రోజులకు సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొట్టాయి.. వీడియోల ఆధారంగా ఈసీ, పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ఎన్నికల వేళ, ఎన్నికల తర్వాత అల్లర్లలోనూ పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి.

కొన్ని రోజులు హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు పారిపోయిన పిన్నెల్లి హైకోర్టు అరెస్టు మినహాయింపు ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాడు. కేసులు నమోదు చేసినప్పటి నుంచి నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ఇంట్లోనే పిన్నెల్లి ఉంటున్నారు. మధ్యంతర బెయిల్ టైమ్‌లో రోజూ ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి సంతకం పెడుతూ వస్తున్నారు. కాగా.. పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అరెస్టును తప్పించుకున్నా ఎట్టకేలకు అరెస్టు తప్పలేదు. జైలుకు వెళ్లక తప్పేలా లేదు.

Tags:    

Similar News