విమానం గాల్లో ఉండగా ఊడిన టైరు... వీడియో వైరల్!
అవును... బోయింగ్ సంస్థ తయారు చేసిన ఓ విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే టైరు ఊడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.
ఈ మధ్య కాలంలో విమానాల్లో వరుసగా తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, ఇతర సమస్యలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ లు ఊడిన సందర్భాలతో పాటు మరెన్నో లోపాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విమానం గాల్లో ఉండగా.. టైరు ఊడిన ఘటన జరిగింది.
ఇటీవల విమానాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, ఇతర సమస్యలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బోయింగ్ విమానాల్లో తలెత్తుతున్న సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ సంస్థ వ్యవహారాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ సమయంలో ఈ సంస్థ తయారు చేసిన ఓ విమానం గాల్లో ఉండగా టైరు ఊడిపోయింది.
అవును... బోయింగ్ సంస్థ తయారు చేసిన ఓ విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే టైరు ఊడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. అయితే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన అమెరికాలో సోమవారం జరిగింది. దీంతో... ఈ వ్యవహారం ఇప్పుడు బోయింగ్ సంస్థ తయారు చేసిన విమానల విషయంలో మరింత చర్చకు దారి తీసింది.
వివరాళ్లోకి వెళ్తే... యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 757-200 విమానం సోమవారం లాస్ ఏంజెల్సి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది. దీంతో... విమానాన్ని దెన్వర్ లో సురక్షింతంగా ల్యాండ్ చేశారు. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ఈ ఘటనపై యునైటెడ్ ఎయిర్ లైన్స్ సంస్థ స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరుపుతామని తెలిపింది. ఇక, ఊడిన టైరు లాస్ ఏంజెలిస్ లో లభించిందని వెల్లడించింది.