అందమైన అమ్మాయే పబ్ కు పిలిస్తుంది.. అప్పుడే అసలు కథ మొదలవుతుంది!

ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న మోష్ పబ్ ఘటన వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-13 06:55 GMT

ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న మోష్ పబ్ ఘటన వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ మోసాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపారు.

అవును... మోష్ పబ్ ఘటన వ్యవహారం హైదరాబాద్ లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ వ్యవహారానికి సంబంధించిన అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా మాదాపూర్ డీసీపీ వినీత్... నష్టాల్లో ఉన్న పబ్బులను సెలక్ట్ చేసుకుని పక్కా ప్లాన్ తో నిందితులు ఈ మోసాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ బ్యాచ్ కు సంబంధించి మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన ఆకాష్ కుమార్, అషత్ నరుల, సూరజ్ కుమార్, సాయికుమార్, శివరాజ్, రోహిత్ కుమార్ లు కలిసి ఈ డేటింగ్ యాప్ ద్వారా యువతులతో వలపుల వల విసిరి.. వ్యాపారుల నుంచి డబ్బులు దండుకునే దందాకు తెరలేపినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా పరిచమైన వారికి అందమైన అమ్మాయిలతో వల వేసి పబ్ లకు రప్పించడంతో ఈ మోసం ప్రారంభమవుతుందని తెలిపారు.

ఇందులో భాగంగా ఈ యాప్ ద్వారా పరిచయమైన వారిని కలుద్దామని వాట్సప్ లో మెసేజ్ లు పంపుతారట తొలుత. ఇలా స్వయంగా అమ్మాయే ఆహ్వానించడంతో ఆమెను వారిని కలిసేందుకు యువకుల్లు రెడీ అవుతారంట. ఈ క్రమలో మెట్రో స్టేషన్ వద్దకు రమ్మని పిలిచి, అక్కడ నుంచి పబ్ లోకి స్వయంగా అమ్మయే తీసుకెళ్తుందంట. ఇలా ఆ అమ్మాయిలతో పబ్ లకు వెళ్లిన యువకులకు అక్కడ చుక్కలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

Read more!

ఇందులో భాగంగా ఆ అందమైన అమ్మాయిలు ఖరీదైన మద్యం, ఆహారం ఆర్డర్ ఇచ్చి గంటలో సుమారు రూ.40,000 నుంచి రూ.50,000 వరకూ బిల్ చేయిస్తారంట! అనంతరం వాష్ రూం కి వెళ్లివస్తానని చెప్పి ఆ అమ్మాయి అక్కడ నుంచి జారుకుంటుందంట. ఎంతసేపు ఎదురుచూసినా ఆమె రాకపోయేన తర్వాత విషయం అర్ధమయ్యేలోపు బిల్ పే చేయాలని సదరు యాజమాన్యం యువకులపై ఒత్తిడి తెస్తుందంట.

ఇలా చేసిన దందావల్ల ముఠాసభ్యులు నలభై రోజుల్లో సుమారు 40 లక్షల రూపాయలు దండుకున్నట్లు చెబుతున్నారు. ఈ మోసానికి బలైన బాధితులు ఇప్పటివరకూ ఎనిమిది మంది బయటకు వచ్చారని చెబుతున్నారు. అయితే... ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ వచ్చిన కథనాల ఆధారంగా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజాగా ఈ విషయాలను వెల్లడించిన మాదాపూర్ డీసీపీ వినీత్... బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. గతంలో డెవిల్స్ క్లబ్ పేరుతో ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఈ తరహా మోసాలను నిర్వహించినట్లు చెబుతున్నారు. ఉద్యోగ వేటలో ఉన్న యువతులను గుర్తించి వారితో కలిసి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో బయటపడిందని పోలీసులు చెబుతున్నారు!

Tags:    

Similar News