దయచేసి జగన్ ని మర్డర్ చేయించవద్దు

ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరు అంటే వైసీపీలో కీలకంగా ఉన్న నేత ఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని క్రిష్ణ మురళి.

Update: 2024-09-28 14:44 GMT

ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరు అంటే వైసీపీలో కీలకంగా ఉన్న నేత ఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని క్రిష్ణ మురళి. ఆయన జగన్ కి ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో మీడియా ముందుకు రాని పోసాని తాజాగా వస్తూనే టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు మీద హాట్ కామెంట్స్ చేశారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆయన చంద్రబాబు మీద మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయం దేవుడితో వద్దు అని కూడా అన్నారు. ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించింది మంచి పనులు చేయడానికి అని సూచించారు. కుట్ర రాజకీయలకు సమయం వెచ్చించవద్దు అని కోరారు. ప్రతి నిమిషం ప్రజల గురించి మాట్లాడాలని ఆయన చంద్రబాబుకు సూచించారు.

లడ్డూ ప్రసాదం కల్తీ అంటూ ప్రచారం తో పాటు డిక్లరేషన్ అని మాట్లాడుతూ నీచ రాజకీయాలకు తెర తీస్తున్నారు అని పోసాని ఫైర్ అయ్యారు. ఈ విధంగా రాజకీయం చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి వారు మిమ్మల్ని క్షమించడు అని ఆయన స్పష్టం చేశారు

మంచి పనులు చేస్తే దేవుడు వందేళ్ల ఆయుష్షు ఇస్తాడని కూడా పోసాని అన్నారు. ఇదిలా ఉండగా జగన్ కి ప్రాణ హాని ఉందని పోసాని ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు దయచేసి జగన్ ని మర్డర్ చేయించకండి అని ఆయన కోరుతూనే మీకు పెద్ద హిస్టరీ ఉందని కూడా అన్నారు

ఎవరెప్పుడు పోతారో ఎవరికీ తెలియదని ఉన్నపుడు చేసిన మంచినే జనాలు గుర్తు పెట్టుకుంటారు అని ఆయన హితవు పలికారు. తాను పోతే తెలుగు వారే కాదు ఇతర భాషల వారు కూడా కొన్నాళ్ళ పాటు అయినా మాట్లాడుకుంటారని అలా బతకాలని ఆయన సూచించారు.

ఇదిలా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని పోసాని అంటూ అక్కడ ఎన్నో నిబంధనలు పెట్టారని అన్నారు. అయితే చంద్రబాబుకు కలలో వెంకటేశ్వరస్వామి వారు కనిపించి జగన్ ని తిరుమల రానీయకు అని చెప్పారా అని ఆయన ప్రశ్నించారు.

ఇక ఏ గూటి కాడ ఆ పలుకు పలకడం మీకు అలవాటేమో అని బాబును ఉద్దేశించి విమర్శించారు. తాను మాత్రం తన గురువు జగన్ అనే భావిస్తాను అని దేవుళ్ళను అయినా మారుస్తానేమో కానీ జగన్ ని మార్చనని పోసాని స్పష్టం చేశారు.

మరో వైపు చూస్తే జగన్ కి ప్రాణ హాని ఉందని నిన్న భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఈ రోజు పోసాని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే నిజంగా అలాంటిది జరుగుతోందా లేక వైసీపీ నేతలు అప్రమత్తం చేయాలని ఈ మాటలు అంటున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. మరో వైపు చూస్తే లడ్డూ ప్రసాదం ఇష్యూ వేడి అలా సాగుతోనే ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News