పవన్ పై పోటీకి పోసాని... 'నేనేం పిచ్చోడ్ని కాదు'!

పవన్ కళ్యాణ్‌ పై పోటీ చేయమని నాకు సీటు ఇస్తే ఖచ్చితంగా పోటీ చేయను. చేసినా నేను గెలవను. పవన్ కళ్యాణ్ టాప్ స్టార్

Update: 2023-08-26 12:30 GMT

గత నాలుగైదు రోజులుగా పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే తాను మరణిస్తే అందుకు నారా లోకేష్ కారణం అని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన... అనంతరం డీజీపీని కలిశారు. నారా లోకేష్ తనను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు.

అదే సమయంలో నారా లోకేష్ తో పాటు చంద్రబాబు పైనా పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత మామను పొడిచినోడికి... పవన్ కల్యాణ్ ఒక లెక్కా అన్నస్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల్లో పోటీ చేయడం, అది కూడా పవన్ కల్యాణ్ పై పోటీచేయడం వంటి విషయాలపై పోసాని స్పందించారు.

అవును... వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం, అది కూడా పవన్ కల్యాణ్ పై పోటీ చేయడం వంటి విషయాలపై తనదైన శైలిలో స్పందించారు పోసాని. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ పై తాను పోటీ చేయనని... పవన్ పై పోటీ చేయడానికి తానేం పిచ్చోడిని కాదని పోసాని క్లారిటీ ఇచ్చారు.

"పవన్ కళ్యాణ్‌ పై పోటీ చేయమని నాకు సీటు ఇస్తే ఖచ్చితంగా పోటీ చేయను. చేసినా నేను గెలవను. పవన్ కళ్యాణ్ టాప్ స్టార్. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ ని. అతి సామాన్యుడ్ని. అసలు నేను పవన్ కళ్యాణ్‌ పై ఎలా నిలబడతాను. ఆయనకి నాకు పోలికే లేదు. చచ్చినా నేను గెలవలేను. డిపాజిట్లు కూడా రావు.." అని స్పందించారు పోసాని.

ఇదే సమయంలో.. "నేనేం అంత అమాయకుడ్ని కాదు.. పిచ్చోడ్ని అంతకంటే కాదు.. పవన్ కళ్యాణ్‌ పై నేను పోటీ చేస్తే ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు.. అలాంటప్పుడు నేనెందుకు పోటీ చేస్తాను.." అంటూ ఎదురు ప్రశ్నించారు పోసాని!

కాగా... గతంలో కమెడియన్ అలీ విషయంలో కూడా అప్పట్లో ఇలాంటి ప్రశ్నలు, కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ అదేశిస్తే పవన్ కల్యాణ్ పై పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా... తాజాగా పోసానిపై కూడా ఇలాంటి గాసిప్స్ వస్తుండటంతో... ఆయన తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు!

Full View
Tags:    

Similar News