కాపులపట్ల చంద్రబాబు... పోసాని సంచలన వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా కాపులకు చంద్రబాబు చేసిన అన్యాయాలు ఇవని.. ఇప్పుడు చెబుతున్న కబుర్లు ఇవని చెబుతూ నిప్పులు చేరిగారు!
చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుంటే, ఆ పార్టీ ఎన్టీఆర్ ది కాదని, ఆ ఆఫీస్ ఎన్టీఆర్ ది కాదని చెబితే... వై, హౌ అని ఎన్టీఆర్ అడిగితే... నో ఆన్సర్! అంటూ మొదలుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి... చంద్రబాబు - కాపులు అనే టాపిక్ పై అన్నట్లుగా స్పందించారు. ఈ సందర్భంగా కాపులకు చంద్రబాబు చేసిన అన్యాయాలు ఇవని.. ఇప్పుడు చెబుతున్న కబుర్లు ఇవని చెబుతూ నిప్పులు చేరిగారు!
అవును... గతంలో కాపులకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని.. అనంతరం ఆ కాపుల ఓట్లతోనే తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారని.. దీనికోసం పవన్ కల్యాణ్ కు వందల కోట్లు ఇచ్చారని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... కాపులకు దేవుడు అని చెప్పే వంగవీటి రంగాను చంపిన తర్వాత.. తిరిగి తమ కాపులంతా కలిసి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి పవన్ కల్యాణ్ సెలవిస్తున్నారని పోసాని అన్నారు.
గతంలో.. కాపులు గూండాలు, కాపులు రౌడీలు, కాపులకు ఓటేస్తే కమ్మ వాళ్లను బ్రతకనివ్వరు అని చెబుతూ కాపులను, చిరంజీవిని అన్ పాపులర్ చేశారని.. ఆ పార్టీని ఓడించారని చెప్పిన పోసాని... ఇప్పుడు చంద్రబాబు ఆఫీసులో కూర్చుని తొడగొట్టి ఛాలెంజ్ లు చేస్తున్నారని అన్నారు! ఇందులో భాగంగా.. ఏ కాపులను అయితే తాను బూతులు తిట్టానో, ఏ కాపులను తాను రౌడీలు గూండాలు అని అన్నానో, అదే కాపుల ఓట్లతో తాను సీంఎం అవుతానంటూ ఛాలెంజ్ చేస్తున్నారని తెలిపారు!
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ను చంద్రబాబు లొంగదీసుకున్నారని.. వందల కోట్లు విసిరికొట్టారని పోసాని ఆరోపించారు. అందుకు కారణం... చంద్రబాబు ఖాళీగా ఉండరని, పదవి లేకపోతే ఆయనకు పిచ్చెక్కుతుందని, అనంతరం ఆ పిచ్చిని సమాజానికి ఎక్కిస్తారని అన్నారు. ఇందులో భాగంగా... కులాల మధ్య, మతాల మధ్య గొడవలు సృష్టిస్తారని తెలిపారు. ఇంత చేసినా కూడా పవన్ కల్యాణ్ కి చంద్రబాబు దేవుడని పోసాని అన్నారు!
ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా చంద్రబాబు... వృద్ధులు, వికలాంగుల పెన్షన్స్ ని వాలంటీర్లు ఇంటివద్దకు తీసుకెళ్లి పంపిణీ చేస్తున్న వ్యవహారంపై దృష్టిపెట్టారని అన్నారు! ఈ సమయంలో ఆంధ్రదేశానికి క్యాన్సర్ గడ్డ లాంటి నిమ్మగడ్డ అనే వ్యక్తితో కలిసి.. వృద్ధులు, వికలాంగులను ఇబ్బందిపెట్టారని.. వారి కష్టాలు వీరికి పట్టవని విమర్శించారు. నాడు పెన్షన్ దారులంతా జగన్ కు ఓటు వేయడం వల్ల చంద్రబాబు వారిపై కక్ష గట్టారని పోసాని సంచలన ఆరోపణలు చేశారు.