పవన్ ని అలా ట్రోల్స్ చేస్తున్నారుగా !

పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన దగ్గర నుంచి జనసేన క్యాడర్ హుషార్ మామూలుగా లేదు.

Update: 2024-09-11 03:44 GMT

పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన దగ్గర నుంచి జనసేన క్యాడర్ హుషార్ మామూలుగా లేదు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని స్టిక్కర్లు తమ బైకులకు అతికించుకుని తెగ జోరు చేశారు. అదే సమయంలో వారు అంతా ఆ బైకులతోనే ఊరూరా తిరిగి సందడి చేశారు. అది ఎంత దాకా వచ్చింది అంటే పవన్ కళ్యాణే స్వయంగా పిఠాపురం వచ్చి రూల్స్ ని బ్రేక్ చేయొద్దు లా అండ్ ఆర్డర్ ని మనమే గౌరవించాలని చెప్పేంతవరకూ అని చెప్పాలి

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే నుంచి పిఠాపురానికే మంత్రిగా ఎదిగారా లేక అలా మిగిలారా అన్నది చర్చ సాగుతోంది. పవన్ ని ఆ విధంగా పిఠాపురం మంత్రి అంటోంది మాత్రం జనసేన సైనికులు కాదు, వైసీపీ నేతలు. పవన్ కళ్యాణ్ ఏపీ మొత్తానికి మంత్రిగా ఉన్నారా లేక ఒక్క పిఠాపురానికే పరిమితమా అని ఒకనాడు జనసేనలో కీలక పాత్ర పోషించి ఈ రోజు వైసీపీలో ఉన్న పోతిన మహేష్ బిగ్ క్వశ్చన్ రెయిజ్ చేశారు.

పవన్ కళ్యాణ్ బెజవాడ వరద నీటిలో మునగుతూంటే అక్కడ పర్యటించలేదని ఆయన విమర్శించారు. అదేమని అడిగితే తాను వస్తే సహాయ చర్యలకు ఇబ్బంది అవుతుందని చెప్పారని గుర్తు చేశారు. అంతే కాదు జనాలు ఎగబడి వస్తారు అని కూడా చెప్పారని కూడా అన్నారు.

మరి పిఠాపురంలో పవన్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించినపుడు సహాయ చర్యలకు ఇబ్బంది అనిపించలేదా లేక జనాలు ఎగబడలేదా అని నిలదీశారు. పవన్ ని విజయవాడ ప్రజలు ఈ విధంగా చేసినందుకు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అని ఆయన పెద్ద బండనే వేశారు.

పోతిన మహేష్ అన్నారని కాదు కానీ బెజవాడలో పవన్ ఎందుకు పర్యటించలేదో అన్న దానికి ఆయన ఇచ్చిన జవాబు అయితే అంత కన్విన్సింగ్ గా లేదు అని అంతా అనుకునేలోపే పవన్ పిఠాపురంలో పర్యటించి విపక్ష వైసీపీకి టార్గెట్ అయ్యారు. పిఠాపురం లో ప్రజలే ప్రజలా అని సోషల్ మీడియా ట్రోలింగ్ బారిన కూడా ఆయన పడ్డారు.

నిజానికి వరద బాధిత ప్రాంతాలలో అంతా పర్యటించారు ఒక్క పవన్ తప్ప. ఆయన కూడా వచ్చి ఉంటే బాగుండేది అని అంతా అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ పది రోజుల పాటు మకాం వేసి అంతా చూసుకున్నారు. దాంతో పవన్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తూ వచ్చారు. ఈ మధ్యలో ఆయన ఆరోగ్యం కూడా బాగా లేదని వార్తలు వచ్చాయి.

ఇక ఇపుడు పవన్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. అంతే కాదు మోకాళ్ల లోతు నీళ్ళలోనూ దిగారు. జగనన్న కాలనీలలో బోటు ప్రయాణం చేశారు. ఇవన్నీ విజువల్స్ గా బయటకు వచ్చాయి. దాంతోనే పవన్ మీద ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయింది.

ఒక విధంగా పవన్ ఇరకాటంలో పడ్డారా లేక ఆయన్ని అలా పడేశారా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా ఇప్పటికైనా మించిపోయింది లేదని పవన్ విజయవాడలో పర్యటించి బాధిత కుటుంబాల సమస్యలను స్వయంగా తెలుసుకుని వారికి ఊరటను భరోసాను ఇవ్వాలని కోరుతున్నారు.

Tags:    

Similar News