జగన్ పై జరిగింది రాయితో దాడి కాదు... తెరపైకి ఎయిర్ గన్ టాపిక్!

ఈ సమయంలో వైసీపీ నేత, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఇది రాయితో జరిపిన దాడి కాదు అని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-14 06:52 GMT

ప్రస్తుతం ఏపీలో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా వారి మధ్య విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన చర్చ జరుగుతుందన్నా అతిశయోక్తి కాదేమో! ఆ స్థాయిలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇదే సమయంలో నేరుగా దేశప్రధాని తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం స్పందించడంతో నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు.

ఈ సమయంలో.. జగన్ పై జరిగిన ఈ దాడి టీడీపీ నాయకుల కుట్ర, చంద్రబాబు - లోకేష్ ల పథకంలో ఒక భాగం అంటూ వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి పనులను పిరికిపంద చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ నేత, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఇది రాయితో జరిపిన దాడి కాదు అని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన దాడిపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... సీఎం జగన్‌ పై రాయితో దాడి జరుగలేదని అన్నారు. ఇదే సమయంలో... ఎయిర్‌ గన్‌ తో జగన్ పై అటాక్ జరిగినట్లు అనుమానం ఉందని.. అటాకర్లు నేరుగా సీఎం నుదుటిని టార్గెట్ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతక ముందు ట్విట్టర్ లో స్పందించిన ప్రకాష్ రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు! ఇందులో భాగంగా... పచ్చమూకల ధాష్ఠికాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయని.. ప్రజలే వీరికి తగిన గుణపాఠం రాబోయే రోజుల్లో చెబుతారని.. విజయవాడలో జగనన్నపై దాడి చేసిన పచ్చ గూండాలని ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో... "మేమంత యాత్రకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక విజయవాడలో జగనన్న బస్సుపై ఉండగా దాడి చేయించిన చంద్రబాబు. నువ్వు నీచుడివని తెలుసు, మరీ ఇంత నీచుడివని తెలియదు చంద్రబాబు..!" అంటూ స్ట్రాంగ్ గా స్పందించారు ప్రకాష్ రెడ్డి!!

Tags:    

Similar News