"అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నిషేధాన్ని ఎత్తేస్తాం"... పీకే కీలక వ్యాఖ్యలు!

సాధారణంగా ఎన్నికల్లో ఇచ్చే హామీలో మద్యాన్ని నిషేదిస్తామని చెబుతుంటారు నేతలు.. ఇంకొంతమంది విడతల వారీగా మద్య నిషేదం అని చెబుతుంటారు.

Update: 2024-09-15 09:30 GMT

సాధారణంగా ఎన్నికల్లో ఇచ్చే హామీలో మద్యాన్ని నిషేదిస్తామని చెబుతుంటారు నేతలు.. ఇంకొంతమంది విడతల వారీగా మద్య నిషేదం అని చెబుతుంటారు. అయితే అనూహ్యంగా... తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వేంటనే మద్య నిషేధాన్ని ఎత్తేస్తామని అంటున్నారు ప్రశాంత్ కిశోర్!

అవును... ప్రశాంత్ కిశోర్ అనే పేరు ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజకీయ వ్యూహకర్తగానే కాకుండా.. మాజీ వ్యూహకర్తగా కూడా ఆయన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉండేవి!

ఈ క్రమంలో ప్రస్తుతం జన్ సురాజ్ పార్టీ చీఫ్ గా ఉన్న ప్రశాంత్ కిశోర్ మద్య నిషేధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... బీహార్ లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మద్య నిషేధాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. అక్టోబర్ 2న తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లను వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... జన్ సురాజ్ ప్రభుత్వం ఏర్పడితే అధికారంలోకి వచ్చిన గంటలోపే బీహార్ లో ఉన్న మద్యపాన నిషేధాన్ని ఎత్తేస్తామని తెలిపారు. పైగా.. దీనికోసం రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నట్లు చెప్పడం గమనార్హం. దీంతో బీహార్ ఎన్నికల్లో ఈ హామీ కీలక భూమిక పోషించే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ సందర్భంగా అటు నితీశ్ కుమార్, ఇటు తేజస్వీ యాదవ్ పైనా ప్రశాంత్ కిశోర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్ రాష్ట్రంలో చేపట్టిన యాత్రపై స్పందిస్తూ.. అతడు ఇప్పటికైనా ఇంటి నుంచి బయటకొచ్చి, జనాల్లోకి వెళ్తుండటం మంచి పరిణామమే అని అన్నారు.

ఇదే క్రమంలో... ఎన్డీయే చేరేందుకు సీఎం నితీశ్ కుమార్ తనకు చేతులు జోడించి క్షమాపణలు చెప్పారని ఇటీవల తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపైనా స్పందిస్తూ.. ఆ ఇద్దరి వల్ల రాష్ట్రానికి ఏపీ ప్రయోజనం లేదని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా... మద్య నిషేధాన్ని రద్దు చేస్తామంటూ పీకే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి!

Tags:    

Similar News