త్వరలో కొత్త బడ్జెట్... ఐటీ విధానంపై ఎస్బీఐ రీసెర్చ్ కీలక నివేదిక!
అవును... మరో నాలుగైదు రోజుల్లో ఆర్థిక మంత్రి కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెరపైకి వచ్చింది. ఈ రీసెర్చ్ కీలక ప్రతిపాదనలు చేసింది.
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇప్పటికే పన్ను చెల్లింపుదారుల నుంచి పలు రకాల సూచనలు, విన్నపాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... రాబోయే బడ్జెట్ లో ఆదాయపు పన్ను రేట్లు తగ్గాలని అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్నట్లు ఓ సర్వే తెలిపింది.
ఈ మేరకు.. గ్రాంట్ థోంటన్ భారత్ ప్రీ-బడ్జెట్ సర్వేలో సుమారు 57 శాతం మందిది ఇదే మాట అని చెబుతున్నారు. ఈ సమయంలో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల్లో 72 శాతం మంది కొత్త ఆదాయ పన్ను విధానాన్నే ఎంచుకుంటున్నారని సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే విషయాలు వెల్లడిస్తూ ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడైంది.
అవును... మరో నాలుగైదు రోజుల్లో ఆర్థిక మంత్రి కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెరపైకి వచ్చింది. ఈ రీసెర్చ్ కీలక ప్రతిపాదనలు చేసింది. ఇందులో భాగంగా.. ఈ బడ్జెట్ లో పాత ఆదాయపు పన్ను చెల్లింపు విధానంలో ఉన్న రాయితీలన్నింటినీ తొలగించడమే కాకుండా.. పూర్తిగా కొత్త పన్ను విధానం అమలు చేయాలని ప్రతిపాదించింది.
ఇదే సమయంలో... నేషనల్ పెన్షన్స్ సిస్టమ్ (ఎన్.పీ.ఎస్) మినహాయింపు పరిమితిని రూ.50,000 నుంచి రు.1 లక్షలు పెంచాలని.. హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం పరిమితిని రూ.25,000 నుంచి రూ.50,000కు పెంచాలని ఎస్బీఐ రీసెర్చ్ ప్రతిపాదించింది. ఇదే సమయంలో.. రూ.10-15 లక్షల మధ్య ఆదాయంపై పన్ను భారాన్ని 15 శాతానికి తగ్గించాలని సూచించింది.
అదే విధంగా... సేవింగ్స్ అకౌంట్ లపై లభించే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.20,000కు పెంచాలని ఎస్బీఐ రీసెర్చ్ ప్రతిపాదించింది. ఈ మార్పులు చేయడం వల్ల ప్రభుత్వానికి సుమారు రు.50,000 కోట్ల మేర ఆదాయం తగ్గుతుందని.. ఇది జీడీపీలో 0.14 శాతానికి సమానమని వెల్లడించింది.
అయినప్పటికీ... ఈ తరహా మార్పుల వల్ల ఆదాయపు పన్ను చెల్లింపులు పెరగటంతో పాటు ప్రజల వద్ద ఆదాయాల్లోనూ కొంతం మిగులు ఏర్పడుతుందని.. ఫలితంగా వినియోగం పెరుగుతుందని.. తద్వారా ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని నివేదిక అభిప్రాయపడింది.