స్కూల్లో అయ్యప్పను అవమానించిన ప్రిన్సిపల్... భక్తుల రియాక్షన్ ఇది!
అవును... స్కూలు పిల్లాడు అయ్యప్పమాల వేసుకుని స్కూలుకి వెల్లడం, దీనిపై ప్రిన్సిపాల్ తిట్టడం, అతడు ఇంటికెళ్లి చెప్పడం, తల్లి తండ్రులు స్కూలు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేయడం, వీరితో పాటు మరికొంతమంది అయ్యప్పలు రావడం, ఇదే సమయంలో ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు ఎంటరవ్వడం చక చకా జరిగిపోయాయి.
అయ్యప్ప మాల వేసుకున్న ఒక విద్యార్థి స్కూల్ కి వెళ్లాడు. దీంతో ప్రిన్సిపల్ సీరియస్ అయ్యారు. దీంతో మనోవేదనకు గురైన విద్యార్థి ఇంటికి వెళ్లి విషయం తల్లిదండ్రులతో చెప్పాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చేసినట్లు చెప్పిన అనుచిత వ్యాఖ్యలు విద్యార్ధి తల్లి దండ్రులకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో వారు స్కూల్ వద్దకు చేరుకుని ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు కూడా ఎంటరయ్యారు! దీంతో... వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది.
అవును... స్కూలు పిల్లాడు అయ్యప్పమాల వేసుకుని స్కూలుకి వెల్లడం, దీనిపై ప్రిన్సిపాల్ తిట్టడం, అతడు ఇంటికెళ్లి చెప్పడం, తల్లి తండ్రులు స్కూలు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేయడం, వీరితో పాటు మరికొంతమంది అయ్యప్పలు రావడం, ఇదే సమయంలో ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు ఎంటరవ్వడం చక చకా జరిగిపోయాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ప్రిన్సిపాల్ తో సారీ చెప్పించి పరిస్థితిని సద్దుమణించించారు!
వివరాళ్లోకి వెళ్తే... పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్ళు గ్రామంలోని ఈశ్వర్ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఒకరు ఇటీవల అయ్యప్ప స్వామి మాల ధరించాడు. ఇలా మాల ధరించడంతో యూనిఫామ్ లేకుండా స్కూల్ కి వెళ్లాడు. దీంతో స్కూల్ ప్రిన్సిపాల్ కు కోపం వచ్చింది. మాలలో ఉన్న విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందులో బాగంగా యూనిఫాం లేకుండా స్కూలు ఎందుకు వచ్చావంటూ ఫైరయ్యారు. విద్యార్థిపై కోపంతో అరిచారు. ఇలా ప్రిన్సిపల్ ఈ రేంజ్ లో ఫైరవడంతో మనోవేదనకు గురైన విద్యార్థిఇంటికి వెళ్లి విషయం తల్లిదండ్రులతో చెప్పాడు. దీంతో.. విద్యార్ధి తల్లి దండ్రులు ఆగ్రహావేశాలతో స్కూల్ కి వచ్చారు! అనంతరం ప్రిన్సిపల్ తో వాగ్వాదానికి దిగారు. మాలలో ఉన్నప్పుడు యూనిఫాం ఎలా వేసుకుంటాడని ప్రశ్నించారు.
దీంతో ఆ స్కూల్లో జరుగుతున్న విషయం బయటకు పొక్కింది. దీంతో విషయం తెలుసుకున్న అయ్యప్ప మాలదారులు స్కూల్ వద్దకు భారీగా చేరుకోవడం మొదలుపెట్టారు. దీంతో స్కూలు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయ్యప్ప స్వామి మాల ధరించిన విద్యార్థి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన స్కూల్ ప్రిన్సిపాల్ ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఏకంగా.. స్కూలు అనుమతులు రద్దు చేయాలని అయ్యప్ప స్వామి మాలదారులు, ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు!
అనంతరం... స్కూల్ ప్రిన్సిపాల్ మతం మారి హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అయ్యప్పలు సైతం అతనిపై ఒక దశలో దాడి చేసేందుకు ప్రయత్నించారని అంటున్నారు. దీంతో... హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు... అయ్యప్ప స్వామి మాలదారులకు, ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ క్షమాపణలు చెప్పడంతో... మాలదారులు, ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు అక్కడ నుంచి వెనుదిరిగారు!