మైనర్ చేసిన పాపానికి రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి..శిక్షలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది
మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఓ ప్రమాదం రెండు నిండు ప్రాణాలు బలితీసుకుంది. ఓ బాలుడి డ్రైవింగ్ ఇద్దరు యువకుల ప్రాణాలు బలితీసుకుంది.
మైనర్లకు డ్రైవింగ్ అప్పగించడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా వారికే డ్రైవింగ్ అప్పగిస్తున్నారు. దీంతో విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. బాలురకు వాహనాలు నడిపించే అవకాశం ఇవ్వడం వల్ల వారికి సరిగా నడపరాక పలు ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నారు. ఇదే తరహాలో దేశంలో చాలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కానీ ఎవరు కూడా మారడం లేదు. తమ తప్పు తెలుసుకోవడం లేదు.
మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఓ ప్రమాదం రెండు నిండు ప్రాణాలు బలితీసుకుంది. ఓ బాలుడి డ్రైవింగ్ ఇద్దరు యువకుల ప్రాణాలు బలితీసుకుంది. ఇప్పుడు వారి కుటుంబాలకు ఆసరా ఎవరు? వారి కుటుంబాన్ని పోషించేది ఎవరు? ఎవరో చేసిన తప్పుకు మరెవరో బాధ్యత వహించాల్సి రావడం దారుణమైన విషయమే. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
పుణెలో ఓ రియల్టర్ కుమారుడు అజాగ్రత్తగా కారు నడపడం వల్ల ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. దీనికి కోర్టు కూడా బాలుడిని ఏం అనలేదు. కేవలం చిన్న చిన్న శిక్షలు వేసి చేతులు దులుపుకుంది. ప్రమాదాలపై ఓ వ్యాసం రాయాలని తేల్చింది. ఓ 15 రోజులు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయాలని ఆదేశించింది.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు సహకరించాలని సూచించింది. ఇలా చిన్న చిన్న శిక్షలతో సరిపెట్టింది. దీనిపై ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు ప్రాణాలు పోవడానికి కారకుడైన బాలుడికి ఇంత చిన్న శిక్షలు వేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే చట్టంపై నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తీర్పులు సమాజంలో ఇంకా నేరస్తులను పెంచినట్లు చేస్తుందంటున్నారు.
బాలురకు డ్రైవింగ్ అప్పగిస్తూ తల్లిదండ్రులు చోద్యం చూస్తున్నారు. ఇతరుల ప్రాణాలు తీసేందుకు పరోక్షంగా కారకులవుతున్నారు. దీనిపై ఏదో చర్యలు తీసుకోవడం కాదు. కఠినమైన చట్టాలు ఉండాల్సిందే. మనుషుల్లో పరివర్తన తీసుకురావడానికి అవసరమైతే చట్టాలను సైతం మార్చాల్సిన అవసంర ఎంతైనా ఉందని పలువురు న్యాయనిపుణులు సూచిస్తున్నారు.