కేశినేని ఇక మూలన పడి ఉండు పుండాకోర్‌.. ప్రముఖ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

కాగా విజయవాడ ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన కేశినేని నానిపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2024-01-06 07:33 GMT

టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని నేని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోక్‌ సభ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని కేశినేని నాని సోషల్‌ మీడియాలో వెల్లడించారు. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ నుంచి కేశినేని నాని ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)పై కేశినేని గెలుపొందారు. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో పీవీపీపై కేశినేని నాని 8,726 ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు.


కాగా విజయవాడ ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన కేశినేని నానిపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా కేశినేని నానిపై మండిపడ్డారు.

కేశినేని నాని పీపాల బస్తా.. బెజవాడకే గుదిబండలా తయారయ్యారంటూ పీవీపీ ధ్వజమెత్తారు. ఏదో మచ్చ వేసుకుని పుట్టావు.. పార్టీ పుణ్యమా అని పదేళ్లు ఎంపీగా బండిని లాక్కొచ్చారన్నారు. బ్యాంకులను బాది, ప్రజలను, ఉద్యోగులని పీల్చి పిప్పి చేశారని తీవ్ర విమర్శలు చేశారు. ఇకనైనా కేశినేని నాని ఒట్టి మాటలు కట్టిపెట్టి ఓ మూలన పడి ఉండు పుండాకోర్‌ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో పీవీపీ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తే పీవీపీకి ఎందుకంత బాధ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక పీవీపీ హైదరాబాద్‌ కే పరిమితమయ్యారు. వైసీపీ కార్యక్రమాల్లోనూ ఎక్కడా ఆయన పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ విజయవాడ ఎంపీ స్థానంలో ఈసారి కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని అనుకుంటోంది.

కాగా కేశినేని నాని ట్విట్టర్‌ వేదికగా.. ‘‘చంద్రబాబు నాయుడుగారు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కూడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్‌ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్‌ సభ స్పీకర్‌ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా. ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను’’ అని పోస్టు చేశారు.

అంతకుముందురోజు కేశినేని నాని నిన్న మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ తిరువూరులో నిర్వహించనున్న సభకు తనను రావొద్దన్నారని బాంబుపేల్చారు. తాను వెళ్లడం లేదని.. తన మైండ్‌ సెట్‌ అభిమానులందరికీ తెలుసన్నారు. అలాగే అభిమానుల మైండ్‌ సెట్‌ నాకు తెలుసన్నారు. తాను టీడీపీ పార్టీకి ఓనర్‌ ను కాదన్నారు. అయితే చెప్పాల్సిన టైమ్‌ వచ్చినప్పుడు అన్నీ చెబుతానన్నారు. తినబోతూ రుచులెందుకు.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని హాట్‌ కామెంట్స్‌ చేశారు. కాలమే అన్నింటిని నిర్ణయిస్తుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడాతారో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత చంద్రబాబు తనకు ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారన్నారు. తనకు ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ కోసమే నిలబడ్డానని కేశినేని నాని తెలిపారు. కానీ, ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదన్నారు. చంద్రబాబుకి తాను వెన్నుపోటు పొడవలేదని.. పొడిచి ఉంటే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినేమోనన్నారు.

తాను ఇండిపెండెంట్‌ గా పోటీ చేసైనా గెలుస్తానని కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. ఆ విషయంలో సందేహం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను విజయవాడ నుంచే పోటీచేస్తానని స్పష్టం చేశారు. కచ్చితంగా మూడో సారి గెలుస్తానన్నారు.

Tags:    

Similar News