పిచ్చి కుక్కలకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి - ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
నిన్న ఓ మీటింగ్ లో కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు.;
తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల శాపాలు తగిలి, "కుక్క చావు చచ్చేది" రేవంత్ రెడ్డియేనని విరుచుకుపడ్డారు.
కౌశిక్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ "తెలంగాణలో మూడు లక్షల పిచ్చికుక్కలు ఉన్నాయి, వాటికి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి," అంటూ ఘాటుగా విమర్శించారు.
నిన్న ఓ మీటింగ్ లో కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. "ఒక శాసనసభపక్ష నేతపై ఇంత ఘోరమైన వ్యాఖ్యలు చేయడం దారుణం. ఇప్పటివరకు 100 మంది సీఎంలు, 100 మంది ప్రతిపక్ష నేతలు మారినా, ఇలాంటి మాటలు ఎవరూ అనలేదు" అని కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ ప్రజలకు హమీ ఇచ్చి ఆరు గ్యారెంటీలు అమలు చేయనందుకు వారి శాపాలు తగిలి కుక్క చావు చచ్చేది రేవంత్ రెడ్డినే అని పాడి కౌశిక్ రెడ్డి విమర్శించాడు. ఇది తెలంగాణ ప్రజలు పెట్టే శాపాలు అని తగిన శాస్తి జరుగుతుందని అన్నారు.
ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గూ శరం లేకుండా శాసనసభపక్ష లీడర్ చావు కోరుకుంటారా? ఏ సీఎం ఇలా చేయలేదు. ప్రతిపక్షనేతను ఇలా చావాలని కోరుకుంటారా? అని రేవంత్ పై కౌశిక్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
‘‘తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల పిచ్చికుక్కలు ఉంటాయి.. ఆ పిచ్చి కుక్కలకు అధ్యక్షుడే రేవంత్ రెడ్డి’’ అని కౌశిక్ రెడ్డి విమర్శించారు.
-కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు ఇవీ
రవీంద్రభారతిలో నిన్న జరిగిన కొలువుల పండుగ కార్యక్రమంలో కేసీఆర్ పై రేవంత్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘స్టేచర్ ఉందని విర్రవీగి స్ట్రెచర్ పై పడ్డారని.. ఇలా విర్రవీగితే మార్చురీకే వెళతారని’ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు మండిపడగా.. తాజాగా కౌశిక్ రెడ్డి అంతకుమించి విరుచుకుపడ్డారు.