కేరళలో అమెరికా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

కేరళ రాష్ట్రం సంచలనాత్మక ఘటనకు వేదిక అయింది. అమెరికా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న లిథువేనియా దేశస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.;

Update: 2025-03-13 06:42 GMT

కేరళ రాష్ట్రం సంచలనాత్మక ఘటనకు వేదిక అయింది. అమెరికా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న లిథువేనియా దేశస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ అమెరికా వెతుకుతున్న నిందితుడు ఎవరు? ఏం చేశాడన్న దానిపై అందరూ ఆరా తీస్తున్నారు.

-భారీ క్రిప్టో మోసంలో కీలక నిందితుడు

అరెస్టయిన నిందితుడు అలెక్సేజ్ బెస్సియోకోవ్ అనే వ్యక్తి. అతను అమెరికాలో పెద్ద క్రిప్టోకరెన్సీ మోసానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. 'గ్యారంటెక్స్' అనే క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్‌ను ఏర్పాటు చేసి, రాన్సమ్వేర్ దాడులు, కంప్యూటర్ హ్యాకింగ్, మాదకద్రవ్యాల లావాదేవీల ద్వారా వచ్చిన నిధులను లాండరింగ్ చేసినట్లు తెలుస్తోంది.

-అమెరికా ఫెడరల్ ఏజెన్సీల విచారణ

అమెరికా ప్రభుత్వం అలెక్సేజ్ బెస్సియోకోవ్‌పై గట్టి నిఘా పెట్టి, అంతర్జాతీయ పోలీసు సంస్థల సహకారంతో ఆచూకీ కనుగొన్నది. కేరళలో అతను తలదాచుకుంటున్న సమాచారం అందుకున్న పోలీసులు, అతడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు అతనిపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేశాయి.

- భవిష్యత్తులో ఏం జరుగనుంది?

అమెరికా ప్రభుత్వం అలెక్సేజ్‌ను తమ దేశానికి అప్పగించాలని భారత అధికారులను కోరనుంది. ఈ కేసు అంతర్జాతీయ నేర ప్రపంచానికి సంబంధించి మరో కొత్త కోణాన్ని తెరపైకి తీసుకురావొచ్చని నిపుణులు భావిస్తున్నారు. భారత ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

ఈ అరెస్ట్ అంతర్జాతీయ నేరాలకు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న మరో కీలక చర్యగా నిలవనుంది. మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News