డేటింగ్ పక్కా.. చాహల్ కొత్త గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ అర్థం అదే?
చాహల్ తో కలిసి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కనిపించిన అమ్మాయి పేరు మహ్ వశ్. వీరిద్దరూ కొద్ది రోజులుగా డేటింగ్ లో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.;
కొద్దికాలం కిందటి వరకు టీమ్ ఇండియా రెగ్యులర్ సభ్యుడైన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇప్పుడు ఏ ఫార్మాట్ లోనూ ఎంపికవడం లేదు. వాస్తవానికి చాహల్ మెరుగ్గానే రాణిస్తున్నా.. అతడు సెలక్టర్ల లెక్కల్లో లేడు. చహల్ తో పాటు ఓ దశలో స్పిన్ మాయాజాలం చేసిన కుల్దీప్ యాదవ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. టి20 ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడయ్యాడు. చాహల్ మాత్రం పూర్తిగా వెనుకబడిపోయాడు.
టీమ్ ఇండియాకు దూరమైన బాధ చాలదన్నట్లు చాహల్ తన భార్య ధనశ్రీతో విడిపోయాడు. వీరిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లుగా కూడా కథనాలు వచ్చాయి. అది జరిగిన కొద్ది రోజులకే గత ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య దుబాయ్ లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చాహల్ ఓ అమ్మాయితో కలిసి వచ్చాడు. దీంతో ఎవరా? యువతి? అంటూ ఆరా తీయడం మొదలైంది.
చాహల్ తో కలిసి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కనిపించిన అమ్మాయి పేరు మహ్ వశ్. వీరిద్దరూ కొద్ది రోజులుగా డేటింగ్ లో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. రేడియో జాకీ అయిన మహ్ వశ్, చాహల్ తో కలిసి డిసెంబరులో దిగిన ఫొటోను గతంలో షేర్ చేశారు. అప్పటికి ఇంకా చాహల్ ధనశ్రీతో విడిపోతున్నట్లు కథనాలు రాలేదు. కానీ, మహ్ వశ్ తో అతడు డేటింగ్‌లో ఉన్నట్లు మాత్రం వైరల్ అయ్యాయి. దీనిని మహ్ వశ్ ఖండించింది. తప్పుడు కథనాలు సృష్టించొద్దని కోరింది.
ఇక చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు సెల్ఫీ వీడియో, ఫొటోలను మహ్ వశ్ ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. చాహల్ తో డేటింగ్ మళ్లీ తెరపైకి రావడంతో మహ్ వశ్ ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలోనే మహ్ వశ్ ఇన్‌స్టా స్టోరీస్ లో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారుతోంది.
మహ్ వశ్.. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కూడా. దీనికిగాను తనకు బెస్ట్ మెగా ఇన్ ఫ్లుయెన్సర్ అవార్డు వరించింది. తాను ఈ స్థాయికి రావడం చూసి చిన్ననాటి మహ్ వశ్ ఎంతో గర్వపడుతుందని.. ఏ తప్పు లేకుండా.. అసత్యాల గురించి పట్టించుకోకుండా మన పని మనం చేస్తూ ముందుకెళ్లాలి అంటూ మహ్ వశ్ పోస్ట్ చేశారు.
చాహల్ తో డేటింగ్ పై వస్తున్న కథనాలను ఉద్దేశించే మహ్ వశ్ ఇలా పోస్ట్ చేసి ఉంటుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.